Ranbir Kapoor Dhoom 4 | బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ధూమ్ 4 సినిమాకు విలన్లు దొరికినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ధూమ్ ఫ్రాంచైజీలో మూడు సినిమాలు రాగా.. బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అయితే నాలుగో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఇన్ని రోజులు ధూమ్ 4 సినిమాలో విలన్‌గా కోలీవుడ్ నటుడు సూర్య నటించబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ.. బాలీవుడ్ నుంచి క్రేజీ కాంబో బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్స్‌గా బాలీవుడ్ బాద్షా షార్ఖ్తో పాటు రణ్‌బీర్ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆదిత్య చోప్రా రణ్‌బీర్ కపూర్‌ను సంప్రదించగా.. రణ్‌బీర్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ పండగా అని చెప్పుకోవచ్చు. యానిమల్ తర్వాత మళ్లీ అలాంటి పవర్ఫుల్ రోల్లో రణ్‌బీర్ కనిపించబోతున్నాడు. మరోవైపు షారుఖ్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటివరకు ధూమ్ ఫ్రాంచైజీ నుంచి మూడు సినిమాలు రాగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాలల్లో హీరోల కంటే విలన్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుదన్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌లో జాన్ అబ్రహాం విలన్‌గా నటించగా.. ధూమ్ 2లో హృతిక్ రోషన్ విలన్‌గా నటించి మెప్పించాడు. ఒక థర్డ్ పార్ట్‌లో అయితే బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించి రూ.500 కోట్లకు వసుళ్లను సాధించాడు. అయితే ఈ మూడు పార్ట్‌లలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటించి అలరించాడు. యష్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో రాబోతున్న ఈ సినిమాకు కూడా ఫస్ట్ మూడు పార్ట్‌లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే ‘ధూమ్ 4’కు కూడా కథను అందించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.