జమ్మూ : రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డీలో ఐదో మ్యాచ్ ఆడుతున్న హైదరాబాద్ చిక్కుల్లో పడింది. జమ్మూ వేదికగా జమ్మూకాశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది.
ఆతిథ్య జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 170 రన్స్‌కే కట్టడిచేసిన హైదరాబాద్.. బ్యాటింగ్‌లో 121 రన్స్‌కే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన జమ్మూకాశ్మీర్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 275 రన్స్ చేసింది. మొత్తంగా ఆతిథ్య జట్టు 324 పరుగుల ఆధిక్యంలో ఉంది.