ఇండోర్: జమ్మూకశ్మీర్ రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. తాజా సీజన్లో ఆ జట్టు సెమీస్‌కు అర్హత సాధించి తొలిసారి ఈ ఘనతను సాధించింది. ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌తో జరిగిన రెండో క్వార్టర్స్‌లో ఆ జట్టు.. 56 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ప్రత్యర్థి ఎదుట 291 పరుగుల లక్ష్యాన్ని నిలిపిన ఆ జట్టు.. మధ్యప్రదేశ్‌ను 234 రన్స్‌కే ఆలౌట్ చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీసిన పేసర్ అకిబ్ నబీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 కీలక వికెట్లు పడగొట్టాడు. ముంబైతో జరిగిన నాలుగో క్వార్టర్స్ పోరులో కర్నాటక 4 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (130), స్మరణ్ రవిచంద్రన్ (83*) రాణించారు.