హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తేతెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఆయన అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, చైనాలో పర్యటించనున్నారు.
దీంతో ‘ఓటుకు నోటు’ కేసులో బెయిల్ షరతులు సడలించాలని, జప్తుచేసిన తన పాస్పోర్టు ఇవ్వాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు.. షరతులతో కూడిన అనుమతి చ్చింది. రూ.లక్ష ష్యూరిటీ సమర్పించాలని, విదేశాల్లో ఉండే అడ్రస్, కాంటాక్ట్ నంబర్ ఇవ్వాలని తెలిపింది. సెప్టెంబర్ 18 లోగా పాస్పోర్టు తిరిగి అప్పగిస్తానంటూ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది.