Yashasvi Jaiswal : భారత క్రికెట్ చరిత్రలో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal ) సరికొత్త అధ్యాయాలు లిఖిస్తున్నాడు. 25 ఏండ్లు అయినా లేని ఈ కుర్రాడు సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్‌పై విధ్వంసక డబుల్ సెంచరీ(214 నాటౌట్)తో దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేశాడు. అతడి దూకుడు, నిలకడ, ఫుట్‌వర్క్ చూసి మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. టీమిండియాకు మరో సెహ్వాగ్(Sehwag) దొరికేశాడంటూ యశస్వీని ఆకాశానికెత్తేస్తున్నారు. యశస్వీ మాత్రం ఆ పొగడ్తలకు పడిపోవడం లేదు.
ఎందుకంటే.. అతడు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చవిచూశాడు. చిన్నప్పటి నుంచి అన్నింటా పోటీని ఎదుర్కొని మరీ ఇక్కడి దాకా వచ్చాడు. ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్న యశస్వీ రాజ్‌కోట్ టెస్టు తర్వాత ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
From catching buses, rickshaws & trains to peeling off Test double tons – Yashasvi Jaiswal ⭐️#INDvENG pic.twitter.com/aOsfw9pfw0
— ESPNcricinfo (@ESPNcricinfo) February 19, 2024
‘భారత దేశంలో పుట్టిన మనం ప్రతి దశలో పోటీని ఎదుర్కొంటూనే ఉంటాం. కష్టపడితేగానీ ఏదీ దరిచేరదు. బస్సు ఎక్కాలన్నా, రైలు ఎక్కాలన్నా ఎంతో కష్టపడాల్సిందే. నేను కూడా అలా కష్టపడినవాడినే. అందుకనే ప్రతి ఇన్నింగ్స్ ఎంత ముఖ్యమే నాకు బాగా తెలుసు. కాబ్టటే నేను ప్రాక్టీస్ సెషన్స్‌లో ఎక్కువా శ్రమిస్తా. ప్రతి ఇన్నింగ్స్ నాకు, జట్టుకు ఎంతో ముఖ్యమే. భారత జట్టు తరఫున దేశానికి ప్రాతినిధ్యం వహించడమనేది నాకు పెద్ద మోటివేషన్. అందుకే నేను క్రీజులో ఉన్న ప్రతిసారి వంద శాతం నా శక్తిని ఉపయోగిస్తా’ అని యశస్వీ తెలిపాడు.
యశస్వీ (214 నాటౌట్)
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔటైన యశస్వీ.. రెండో ఇన్నింగ్స్‌లో తడాఖా చూపించాడు. ఇంగ్లండ్ బౌలింగ్ దళాన్ని ఉతికారేస్తూ సెంచరీ కొట్టాడు. అయితే.. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా వెన్నునొప్పితో మూడో రోజు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. నాలుగో రోజు క్రిజులోకి వచ్చిన యశస్వీ ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు. ప్రపంచంలోనే మేటి పేసర్ అండర్సన్(Anderson) బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లతో తన ఉద్దేశమేంటో చాటాడు. ఆ తర్వాత హర్ట్లే, రెహాన్ అహ్మద్‌ల ఓవర్లలోనూ దంచికొట్టి రెండో డబుల్ సెంచరీ సాధించాడు. దాంతో, 25 ఏండ్ల లోపు రెండు ద్విశతకాలు బాదిన మూడో ఆటగాడిగా యశస్వీ రికార్డు నెలకొల్పాడు.
వెస్టిండీస్ పర్యటనలో సెంచరీ కొట్టాక యశస్వీ సంబురం
అంతేకాదు ఒకే సిరీస్‌లో 20 సిక్సర్లతో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ యంగ్‌స్టర్ టెక్నిక్, టెంపరమెంట్ చూసిన మాజీలంతా భారత భావి తార అంటూ కితాబిస్తున్నారు. భీకర ఫామ్‌లో ఉన్న యశస్వీ ఇదే తరహాలో చెలరేగితే ఎన్నో రికార్డులు తన పేరిట రాసకోవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిరుడు వెస్టిండీస్ పర్యటన(West Indies Tour)లో టెస్టు అరంగేట్రం చేసిన యశస్వీ తొలి మ్యాచ్‌లోనే శతకం బాది ఔరా అనిపించాడు. ఇప్పటివరకూ 7 టెస్టులు ఆడిన ఈ ముంబైకర్ 71.75 సగటుతో 861 పరుగులు సాధించాడు. అందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.