Hyderabad | హైదరాబాద్ : యూసుఫ్‌గూడలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన అతడిని ట్రాఫిక్ ఎస్ఐ ఆపాడు. దీంతో యువకుడు రెచ్చిపోయాడు. బండ బూతులు తిడుతూ.. తాను సైకోనని, తనకు చలానా రాస్తే నీ ఉద్యోగం ఊడగొడుతానని బెదిరించాడు. తనతో పెట్టుకుంటే అంతు చూస్తానని హెచ్చరించాడు. తన బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని చెప్పాడు. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో తన గురించి తెలుసుకో అని యువకుడు ఎస్ఐకి సూచించాడు. ట్రాఫిక్ ఎస్ఐ నరేశ్.. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.