పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు(Aus Vs Ind) రెండో ఇన్నింగ్స్‌లో.. ఇండియన్ ఓపెనర్లు ధీటుగా ఆడుతున్నారు. ఆ ఇద్దరూ తొలి వికెట్‌కు అజేయంగా వందకుపైగా రన్స్ జోడించారు. ఓపెనర్లు జైస్వాల్, రాహుల్‌లు.. అర్థ శతకాలు సాధించారు. ప్రస్తుతం జైస్వాల్ 71, రాహుల్ 50 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జైస్వాల్ తొలిసారి హాఫ్ సెంచరీ కొట్టాడు. 123 బంతుల్లో అతను అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఇక కేఎల్ రాహుల్ టెస్టుల్లో 16వసారి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తాజా సమాచారం ప్రకారం తొలి వికెట్‌కు రాహుల్, జైస్వాల్ మధ్య అజేయంగా 130 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. దీంతో భారత్ 177 రన్స్ ఆధిక్యంలో ఉన్నది.
FIFTY!@klrahul brings up a gritty half-century, his 16th in Test cricket 👏👏
The opening partnership now stands at 128 runs.
Live – https://t.co/gTqS3UPruo…… #AUSvIND #TeamIndia pic.twitter.com/mKCMagUwAE
— BCCI (@BCCI) November 23, 2024
ఆస్ట్రేలియా గడ్డపై భారత ఓపెనర్లు తొలి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం చాలా అరుదైన విషయం. 2004లో చివరిసారి ఆ ఘటన జరిగింది. మళ్లీ 2004 తర్వాత ఇప్పుడే .. ఫస్ట్ వికెట్‌కు వంద రన్స్ జోడించారు. యశస్వి, రాహుల్ .. ఆసీస్ బౌలర్లను అటాక్ చేస్తున్న తీరు ఆకర్షణీయంగా ఉంది.
@StarSportsTamil https://t.co/QmkHOhXjIx
— Stunnersomas (@SomaskandhanV) November 23, 2024