BCCI : అండరన్స్ – టెండూల్కర్ ట్రోఫీలో చివరి టెస్టు రిషభ్ పంత్ (Rishabh Pant) దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్టులో కుడి పాదం వేలికి గాయంతో ఇబ్బంది పడిన భారత వైస్ కెప్టెన్ ఓవల్ టెస్టు (Oval Test)కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో వికెట్ కీపర్ జగదీశన్(N Jagadeesan)ను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు. ప్రస్తుతం పంత్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ చిచ్చరపిడుగు త్వరగా కోలుకోవాలని బీసీసీఐతో పాటు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జూలై 31న ఐదో టెస్టు మొదలవ్వనుంది.
మాంచెస్టర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన పంత్.. శార్దూల్ ఠాకూర్ ఔటయ్యాక కుంటుతూనే క్రీజులోకి వచ్చాడు. 37 పరుగులతో ఎంటరైన అతడు అర్ధ శతకంతో జట్టును ఆదుకున్నాడు. అయితే.. స్కానింగ్ పరీక్షలో అతడి కుడి పాదం వేలు ఎముక విరిగినట్టు తేలడంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు.
N Jagadeesan, the Tamil Nadu wicketkeeper, has earned a maiden Test call up 🇮🇳
He’ll be a back-up for Dhruv Jurel, who kept wickets in both the third and fourth Tests as a substitute to cover for Rishabh Pant’s injuries
Read more: https://t.co/RnUWaTUC77 pic.twitter.com/g83vecHbf8
— ESPNcricinfo (@ESPNcricinfo) July 27, 2025
సో.. పంత్ ఓవల్ టెస్టుకు దూరం అయ్యాడు. జగదీశన్ విషయానికొస్తే.. తమిళనాడుకు చెందిన ఈ యంగ్‌స్టర్ దేశవాళీలో నిలకడగా ఆడుతున్నాడు. ఈమధ్యే తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో సూపర్ ఫిఫ్టీ బాదిన జగదీశన్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇక గాయం కారణంగా నాలుగో టెస్టు ఆడని ఆకాశ్ దీప్ కోలుకున్నాడు. కాబట్టి.. ఐదో టెస్టులో బుమ్రాను ఆడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
భారత స్క్వాడ్ (ఐదో టెస్టు కోసం) : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కంభోజ్, అర్ష్‌దీప్ సింగ్, ఎన్.జగదీశన్(వికెట్ కీపర్).
మాంచెస్టర్ టెస్టులో ఓటమి తప్పదనుకున్న వేళ భారత జట్టు అపూర్వ పోరాటంతో ఔరా అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా.. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల అద్భుత పోరాటంతో సిరీస్ సమం చేసింది. ఐదు సెషన్ల పాటు ఇంగ్లండ్ బౌలర్లను అలసిసొలసేలా చేశారు ఈ నలుగురు . ఓల్డ్ ట్రఫోర్డ్‌లో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ స్టోక్స్ సేన ఆశలపై నీళ్లు చల్లారు. దాంతో.. చివరి టెస్టులో విజయంతో సిరీస్ పట్టేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది.