song launched | కమాన్ చౌరస్తా, జూలై 28 : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంశానికి చెందిన ఎనిమిదో తరం మనుమడు వీరభద్ర స్వామి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన, కేఎస్ఆర్ క్రియేషన్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రహ్మం గారి గాన సుధా వీడియో పాటను ఆదివారం కళాభారతిలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ రావడం చాలా సంతోషంగా ఉందనీ, బ్రహ్మంగారి మీద రాసిన పాటను నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన సాంస్కృత ప్రదర్శన అల్లరించాయి. ఈ కార్యక్రమంలో పాట నిర్మాత కాయితోజ్ పవన్ కుమార్, గాయకులు కిట్ల సతీష్,రచయిత రంగు గోవర్ధన్ తదితరులున్నారు.