IND vs WI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో భారత జట్టు చెలరేగిపోతోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయంతో వెస్టిండీస్ (West Indies)కు షాకిచ్చిన టీమిండియా రెండో టెస్టులోనూ పట్టుబిగించింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో శుభ్‌మన్ గిల్ సెంచరీతో భారీ స్కోర్ అందిస్తే.. ఆ తర్వాత రవీంద్ర జడేజా వికెట్ల వేటతో విండీస్‌కు దడపుట్టించాడు. జడ్డూ విజృంభణతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కరీబియన్ టీమ్.. రెండో రోజు ఆట ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 140 రన్స్ చేసింది. ఇంకా 378 పరుగుల లోటుతో ఉంది పర్యాటక జట్టు.
ఢిల్లీ టెస్టులోనూ భారత జట్టు జోరు చూపిస్తోంది. టాపార్డర్ మెరుపులతో భారీ స్కోర్ చేసిన టీమిండియా అనంతరం వెస్టిండీస్ భరతం పడుతోంది. తొలి ఇన్నింగ్స్‌ను శుభ్‌మన్ గిల్ సేన డిక్లేర్ చేశాక బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. సిరాజ్, బుమ్రా బౌలింగ్‌లో వికెట్ కాపాడుకున్న జాన్ క్యాంప్‌బెల్ (10) స్పిన్నర్ జడేజా ఓవర్లో స్వీప్‌షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. సుదర్శన్ చక్కగా అందుకోవడంతో అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. తగ్‌నరైన్ చందర్‌పాల్(34), అలిక్ అథనజే (41)లు కాసేపు ప్రతిఘటించి విండీస్‌ను ఆదుకునేలా కనిపించారు.
𝘾𝙖𝙪𝙜𝙝𝙩 & 𝘽𝙤𝙬𝙡𝙚𝙙
Wicket No.3️⃣ for Ravindra Jadeja 👌
Wicket No.4️⃣ for #TeamIndia 👏Updates ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/ag71zBWOHy
— BCCI (@BCCI) October 11, 2025
కానీ, జడ్డూ తన మ్యాజిక్ చూపించగా చందర్‌పాల్‌ను స్లిప్‌లో రాహుల్ చేతికి చిక్కాడు. దాంతో, రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడగా.. 87 పరుగులకే రెండో వికెట్ పడింది. క్రీజులో కుదురుకున్న అథనెజేను కుల్దీప్ ఔట్ చేయగా.. రోస్టన్ ఛేజ్(0)ను రిటర్న్ క్యాచ్‌తో జడ్డూ డగౌట్ చేర్చాడు. అంతే.. 107కే నాలుగు వికెట్లు పడడంతో మరోసారి ఆలౌట్ ప్రమాదంలో పడింది విండీస్. అయితే..రు షాయ్ హోప్ (31 నాటౌట్), టెవిన్ ఇమ్లెచ్ (14 నాటౌట్) ఆచితూచి ఆడుతూ వికెట్ కాపాడుకున్నారు. దాంతో.. రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్ 4 వికెట్లు కోల్పోయి140 రన్స్ చేసింది. ఈ ఇద్దరిని మూడో రోజు త్వరగా వెనక్కి పంపితే తొలి సెషన్లోనే కరీబియన్ జట్టు కుప్పకూలడం ఖాయం.
𝙄.𝘾.𝙔.𝙈.𝙄
Good bowling 🤝 Sharp fielding
Ravindra Jadeja led #TeamIndia‘s charge today with the ball 🔥
Updates ▶ https://t.co/GYLslRzj4G#INDvWI | @IDFCFIRSTBank | @imjadeja pic.twitter.com/vrkGka7Pm7
— BCCI (@BCCI) October 11, 2025
తొలి రోజు ఓపెనర్లు కేఎల్ రాహుల్(38), యశస్వీ జైస్వాల్(175) శుభారంభంతో గట్టి పునాది వేయగా.. యశస్వీ శతకంతో రెచ్చిపోయాడు. మూడో స్థానంలో కుదురుకున్న సాయి సుదర్శన్ (87) అర్ధ శతకంతో చెలరేగడంతో మొదటి రోజే భారీ స్కోర్ చేసిన భారత్.. రెండో రోజు తొలి సెషన్ మొదలైన కాసేపటికే యశస్వీ వికెట్ కోల్పోయింది. మూడో డబుల్ సెంచరీ కొట్టాలనుకున్న యశస్వీ.. సారథి శుభ్‌మన్ గిల్(129 నాటౌట్)తో సమన్వయం లోపంలో రనౌట్ ఆయ్యాడు.
𝙄.𝘾.𝙔.𝙈.𝙄
1️⃣2️⃣9️⃣* Runs
1⃣9️⃣6️⃣ Balls
1️⃣6️⃣ Fours
2️⃣ Sixes👇 Relive #TeamIndia captain Shubman Gill’s 🔟th Test Century 💯#INDvWI | @IDFCFIRSTBank | @ShubmanGill
— BCCI (@BCCI) October 11, 2025
ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి (43) జతగా తనదైన షాట్లతో అలరించిన గిల్ జట్టు స్కోర్ బోర్డును 400 దాటించాడు. నితీశ్ వెనుదిరిగాక.. ధ్రువ్ జురెల్(44)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. గ్రీవ్స్ ఓవర్ల్ సిక్సర్‌తో దూకుడు పెంచిన గిల్.. కెరీర్లో శతకం సాధించాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన గిల్ సిక్స్, ఫోర్లతో విండీస్ బౌలర్లను వణింకించాడు. అయితే.. రోస్టన్ ఛేజ్ ఓవర్లో జురెల్ బౌల్డ్ కావడంతో 518/5 వద్ద టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.