IND vs ENG : ఓవల్ టెస్టులో మూడో రోజు భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(118) సెంచరీతో విరుచుకుపడగా.. టీ సెషన్ తర్వాత రవీంద్ర జడేజా(53 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేసిన జడ్డూ యువ పేసర్ జోష్ టంగ్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ సాధించాడు. ఈ సిరీస్లో అతడికిది ఆరో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
మరో ఎండ్లో వాషింగ్టన్ సుందర్ (16 నాటౌట్) సైతం బ్యాట్ ఝులిపిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. జడ్డూ, ధ్రువ్ జురెల్ (34) ఏడో వికెట్కు 50 రన్స్ జోడించి ఆధిక్యాన్ని 300లకు చేరింది. అయితే.. ఆ తర్వాత బంతికే ఓవర్టన్ బౌలింగ్లో జురెల్ ఎల్బీగా వెనుదిరిగాడు. అయినా సరే మాంచెస్టర్ టెస్టులో జట్టును గట్టెక్కించిన సుందర్ జతగా జడేజా భారీ స్కోర్ అందించే పనిలో నిమగ్నమయ్యాడు.
5⃣0⃣-run partnership between Ravindra Jadeja & Dhruv Jurel 🤝#TeamIndia lead England by 3⃣0⃣0⃣ 🙌
Updates ▶️ https://t.co/Tc2xpWMCJ6#ENGvIND | @imjadeja | @dhruvjurel21 pic.twitter.com/YwIYr4ojo4
— BCCI (@BCCI) August 2, 2025