IND vs NZ : సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే ఇండోర్ వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు వెనుదిరగగా.. శ్రేయాస్ అయ్యర్ (3), కేల్ రాహుల్ (1) సైతం పెవిలియన్ బాట పట్టారు. గత మ్యాచ్‌లో సెంరీతో మెరిసిన రాహుల్ ఈసారి కవర్స్‌లో సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో.. 71 పరుగులకే టీమిండియా ప్రధాన బ్యాటర్లు డగౌట్ చేరారు. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ(33 నాటౌట్), నితీశ్ కుమార్ రెడ్డి(5 నాటౌట్)లు జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. 14 ఓవర్లకు స్కోర్.. 78-4. ఇంకా విజయానికి 260 పరుగులు అవసరం.
న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ఛేదనను టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(23) దూకుడగా ఆరంభించారు. కానీ, రోహిత్ మరోసారి స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగాడు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన కెప్టెన్ గిల్‌ను జేమీసన్ బౌల్డ్ చేశాడు. దాంతో, పవర్ ప్లేలోనే 45కే ఓపెనర్లు ఔటయ్యారు. పెద్ద షాట్‌కు యత్నించిన శ్రేయాస్ అయ్యర్(3) మిడాఫ్లోనే క్యాచ్ ఇవ్వగా.. కేఎల్ రాహుల్(1) సైతం స్పిన్నర్ లెనాక్స్ బౌలింగ్‌లో సులువైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు.
End of Powerplay!#TeamIndia 66/2 after 10 overs in the chase 👌👌
Virat Kohli is joined by Shreyas Iyer at the crease
Updates ▶️ https://t.co/KR2ertVUf5#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/8ajPUgl5xT
— BCCI (@BCCI) January 18, 2026
నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్లు దంచేశారు. 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలనుకున్న భారత బౌలర్ల వ్యూహాలను తిప్పికొడుతూ డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) కొండంత స్కోర్ అందించారు. క్రీజులో కుదురుకున్న ఈ ద్వయం మిడిల్ ఓవర్లలో ఎడాపెడా ఫోర్లు, చెలరేగి స్కోర్ బోర్డును ఉరికించింది. సెంచరీ తర్వాత ఇద్దరూ ఔట్ కావడంతో స్కోర్ వేగం తక్కింది. ఆఖర్లో కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్(28 నాటౌట్) ధనాధన్ ఆటతో స్కోర్ 330 దాటించాడు. దాంతో, టీమిండియాకు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Innings Break!
New Zealand post a formidable total of 337/8 in the series decider.#TeamIndia chase coming up shortly. Stay tuned!
Scorecard – https://t.co/Zm5KbOqvpl #TeamIndia #INDvNZ #3rdODI @IDFCfirstbank pic.twitter.com/bz6Zdlcqsw
— BCCI (@BCCI) January 18, 2026