సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ప్రమాదం జరగగానే కొన్నాళ్లు హడావుడి చేయడం… ఆ తరువాత ఆ విషయాన్ని పక్కన పెట్టేయడం ప్రభుత్వ యంత్రాంగానికి సర్వ సాధారణమైంది. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన తరువాత అగ్నిమాపక శాఖ, హైడ్రా విభాగాలు అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారం, పది రోజుల పాటు హడావిడి చేశారు. తిరిగి ఆ విషయాన్ని పక్కన పెట్టేశారని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం వచ్చేసింది… వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువ జరిగేందుకు అవకాశముం టుంది. ఇప్పటికే ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదం సంభవిస్తున్నది.
చిన్న చిన్న అగ్నిప్రమాదాలను అందరూ తేలికగా తీసుకుంటూ ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం సంభవించినప్పుడు ఆ విషయం పెద్దదవుతుంది. దీంతో వెంటనే జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, హైడ్రా, అగ్నిమాపక శాఖలు రంగంలోకి దిగి ప్రమాదాలు జరగకుండా ప్రణాళికలు రచిస్తున్నామని, ప్రమాదాలకు అవకాశాలున్న భవనాలపై దృష్టి పెట్టి అక్కడ తగిన చర్యలు తీసుకుంటామని చెబుతుంటారు. అన్నట్లుగానే ఒకటి రెండు భవనాలకు నోటీసులు ఇచ్చేసి ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇలా ప్రతి యేడూ జరుగుతున్న తంతే. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు శాస్త్రీయమైన విశ్లేషణ, అందుకు తగిన చర్యలు తీసుకోవడంలో మాత్రం ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. ప్రభు త్వం తగిన విధంగా స్పందించకపోవడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రాణ నష్టం, అస్తినష్టం జరుగుతూనే పోతుంది.
తప్పించుకోలేని స్థితిలో…!
హైదరాబాద్ మహానగరంలో భారీ భవంతులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, పబ్స్, దవాఖానలు, హాస్టల్స్, వివిధ షాపింగ్ దుకాణాలు వేలాదిగా ఉన్నాయి. అందులో పాత భవనాల్లో నడుస్తున్నవి కూడా చాలానే ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి విద్య, ఉపాధి కోసం హైదరాబాద్ మహానగరానికి వచ్చేవారి సంఖ్య ప్రతియేడూ ఎక్కువగానే ఉంటుంది. హైదరాబాద్ దక్షిణ, సెంట్రల్, పశ్చిమ, నార్త్‌కు సంబంధించిన ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించేందుకు ఎక్కువగా అవకాశాలున్నా యని అగ్నిమాపకశాఖ నివేదికలు చెబుతున్నాయి. అలాంటిది అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన వేళ, హడావుడికే పరిమితమవ్వడం పై సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ప్రమాదాలు చెప్పి రావు, ్రప్రమాదాలు జరగకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టడంతో కొన్నింటినైనా నివారిం చేం దుకు అవకాశాలుంటాయి. ఎక్కువగా ప్రమాదాలు షార్ట్ సర్క్యూట్, మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయి. అలాంటిది షార్ట్ సర్క్యూట్‌కు ఎలాంటి సందర్భాల్లో అవుతాయి. నగర వ్యాప్తంగా భవనాల్లోని సెల్లార్లలో జరుగుతున్న వ్యాపారాలపై ఆరా తీయడం వంటి వాటి విషయంలో చర్యలు నామ మా త్రంగానే ఉంటున్నాయి. ఏకంగా సెల్లార్లలో దవాఖానలే కొనసాగుతున్నాయి. చిన్న చిన్న గల్లీలో మెట్లు కూడా సరిగ్గా లేనిచోట హాస్ట ల్స్ నిర్వహిస్తున్నారు. అందులోనే వంట గదులు నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నో చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా అటూ జీహెచ్ఎంసీ ఇటూ హైడ్రా, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ ఎవరు కూడా పూరిస్థాయిలో ఈ సమస్యలపై దృష్టిపెట్టడం లేదంటూ సామాన్య పౌరులు చెబుతున్నారు.
పోలీసులు నోటీసులిచ్చినా?
సినిమా హాల్స్, పబ్‌లు ఇలా వినోద్మాకమైన వ్యాపార సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గతంలో సైబరాబాద్ పోలీసులు సుమారు 50 పబ్బుల వరకు సరైన ప్రమాణాలు పాటించడం లేదంటూ నోటీసులు సైతం జారీ చేశారు. దీనిపై జీహెచ్ఎంసీ వేగంగా స్పందించకుండా, ఆ విషయాన్ని సరిగ్గా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. పలు ప్రభుత్వ శాఖలతో ముడిపడి ఉన్న విషయంలో సమన్వయ కమిటీలు నిరంతరం పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరముంది. కానీ కొన్ని రోజులపాటు హడావిడి చేసి, ఆ తరువాత ఈ విషయాన్ని మరిచిపోవడం వల్ల ఎప్పటికీ ఈ సమస్యలు అపరిష్కృతంగానే ఉంటాయి. తాజాగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న వ్యాపార సముదాయాలు లైసెన్స్‌లు తీసుకోవడం, ఎన్వోసీలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే 18 సినిమా థియేటర్లకు నోటీసులు జారీ చేశారు.