అచ్చంపేట రూరల్, ఫిబ్రవరి 21 : శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం ట్రయల్న్ తవ్వకం పనులు అత్యంత గోప్యంగా చేపడుతున్నారు. ప్రభుత్వం, ప్రాజెక్టు పనులు చేపట్టే ఏజెన్సీ అయిన జేపీ కంపెనీ ప్రతినిధులు మీడియాకు సైతం అనుమతి ఇవ్వకుండా.. ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడ్తున్నారు.
మన్నెవారిపల్లికి వెళ్లిన మీడియా ప్రతినిధులను ట్రయల్న్ జరిగే ప్రదేశానికి వెళ్లనీయకుండా బయటకే పరిమితం చేశారు. ఇరిగేషన్ అధికారులు ఒకటి, రెండు ఫొటోలతో సరిపెట్టి మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి పంపించారు. పనులకు సంబంధించిన వివరాల కోసం నల్లగొండ ఇరిగేషన్ ఈఈ చక్రపాణిని ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.