IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఎప్పుడూ బలమైన జట్టే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాదిరిగానే ఆ జట్టు నిండా స్టార్లే. కానీ, ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు ఆ టీమ్. 2014లో తొలిసారి ఫైనల్ ఆడిన పంజాబ్.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ బిగ్ ఫైట్‌కు అర్హత సాధించింది. అప్పుడు జార్జ్ బెయిలీ (Jeorge Bailey) జట్టును నడిపించగా.. ఇప్పుడు శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) సారథిగా ఉన్నాడు. ఫ్రాంచైజీకి ట్రోపీ అందించడంలో బెయిలీ విఫలమయ్యాడు. కానీ, అయ్యర్ మాత్రం తన కెప్టెన్సీకి తిరుగులేదని చాటడం ఖాయం అనిపిస్తోంది.
నిరుడు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు కప్ అందించిన శ్రేయాస్ ఈసారి పంజాబ్‌ను ఛాంపియన్‌గా నిలిపేందుకు వ్యూహాలు పన్నుతున్నాడు. కోచ్ రికీ పాంటింగ్ అండగా.. మౌన మునిలా కనిపించే ఈ డాషింగ్ బ్యాటర్ తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతాడని ప్రీతి జింతా అండ్ కో.. భావిస్తోంది.
Captain’s Photoshoot – ✅😎
Pre-match Press Conference – ✅🎙
All eyes 👀 on #TATAIPL Final tomorrow ⌛#RCBvPBKS | #Final | #TheLastMile | @RCBTweets | @PunjabKingsIPL pic.twitter.com/tGdWKbZUhp
— IndianPremierLeague (@IPL) June 2, 2025
ఐపీఎల్ 2014 ఎడిషన్‌లో జార్జ్ బెయిలీ సారథ్యంలో పంజాబ్ దుమ్మురేపింది. ఆల్‌రౌండ్ షోతో ప్రత్యర్థులకు షాకిస్తూ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 14న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో వృద్ధిమాన్ సాహ(115 నాటౌట్) అజేయ సెంచరీతో కదం తొక్కగా.. మనన్ వొహ్రా(67) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 200 పరుగుల ఛేదనలో మనీశ్ పాండే(94) విధ్వంసక బ్యాటింగ్‌తో పంజాబ్‌కు ఓటమి ఎదురైంది. యూసుఫ్ పఠాన్(36), కెప్టెన్ గౌతమ్ గంభీర్(23)లు ధనాధన్ ఆడడంతో 3 వికెట్ల తేడాతో కోల్‌కతా విజేతగా అవతరించింది. దాంతో, బెయిలీ టీమ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
The two captains that have taken Punjab to an IPL final 🤝 pic.twitter.com/F4Wu9dvZS3
— ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2025
ఆ తర్వాత పలువురు కెప్టెన్లు మారినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. అయితే.. 18వ సీజన్ మెగా వేలంలో శ్రేయాస్‌ను భారీ ధరకు కొన్న పంజాబ్ అందుకు తగ్గ ఫలితాల్ని చవిచూస్తోంది. మిస్టర్ కూల్ సారథిగా కనిపించే అయ్యర్.. జట్టును అద్భుతంగా నడిపిస్తూ ప్లే ఆఫ్స్ చేర్చాడు. క్వాలిఫయర్ 1లో ఓటమితో కుంగిపోయిన సహచరుల్లో ఆత్మవిశ్వాసాన్ని రగిల్చిన అతడు.. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ తన కెరియర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రా, బౌల్ట్, శాంట్నర్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అయ్యర్ 87 నాటౌట్‌తో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. టైటిల్ పోరులోనూ అయ్యర్ సేన విజృంభిస్తే బెంగళూరు తొలి టైటిల్ కల కల్లలు అయినట్టే.