IND vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(60 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(53 నాటౌట్) హాఫ్ సెంచరీ బాదారు. స్పెన్సర్ జాన్సన్ ఓవర్లో ఫ్రీ హిట్‌ను సిక్సర్‌గా మలిచి అయ్యర్ ఫిఫ్టీ సాధించాడు. గిల్ తనదైన స్టయిల్లో సిక్సర్ బాది ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో గిల్ 50 రన్స్ సాధించాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో రెండో వికెట్‌కు వీళ్లిద్దరూ 112 పరుగులు జోడించారు. ఓవర్లకు స్కోర్.. 128/1.
Shreyas Iyer joins the party with a 41 ball FIFTY 💪💪
Live – https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/EW8syRgVXq
— BCCI (@BCCI) September 24, 2023
ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. హేజిల్‌వుడ్ దెబ్బకు 16 రన్స్ వద్దే ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. మొదటి వన్డేలో దంచి కొట్టిన రుతురాజ్ గైక్వాడ్(8) తక్కువకే వెనుదిరిగాడు. ఆ తర్వాత గిల్, అయ్యర్ ధనాధన్ ఆడుతూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు.