Wimbledon : ఇటలీ యువకెరటం జాస్మినె పవోలిని (Jasmine Paolini) మరోసారి చరిత్ర సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌గా జేజేలు అందుకన్న జాస్మినె వింబుల్డన్ (Wimbledon) ఫైనల్లో అడుగుపెట్టిది. తద్వారా మహిళల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ అమ్మాయిగా రికార్డు నెలకొల్పింది.
గురువారం సెంటర్ కోర్టులో ఆద్యంతం ఉత్కంఠ రేపిన పోరులో డొన్నా వెకిక్‌పై జాస్మినె విజయ ఢంకా మోగించింది. దాంతో, ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఫైనల్లో కాలు మోపిన రెండో ప్లేయర్‌గా నిలిచింది. ఆమె కంటే ముందు ‘అమెరికా నల్ల కలువ’ సెరెనా విలియమ్స్ (Serena Williams) ఈ ఫీట్ సొంతం చేసుకుంది. టైటిల్ కోసం రెండో సెమీఫైనల్ విజేతను జాస్మినె ఢీ కొట్టనుంది.
Just listen to that Centre Court roar 🤯#Wimbledon | @JasminePaolini pic.twitter.com/z1W7Ll0zEl
— Wimbledon (@Wimbledon) July 11, 2024
ఫేవరెట్‌గా వింబుల్డన్‌లో బరిలోకి దిగిన జాస్మినె అంచనాలను మించి రాణించింది. సెమీఫైనల్లో ఆమెకు డొన్నా వెకిక్ గట్టి పోటీనిచ్చింది. తొలి సెట్‌ను 6-2తో గెలిచి జాస్మినెను ఒత్తిడిలో పడేసింది. అయితే.. ఇటలీ ముద్దుగుమ్మ అనూహ్యంగా పుంజుకొని వరుసగా రెండు సెట్లు గెలుపొందింది. 2-6 6-4, 7-6తో మ్యాచ్ ముగించి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. బార్బొరా క్రెజికోవా, ఎలెనా రిబాకీనాల మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో జాస్మినె ఫైనల్లో తలపడనుంది.