2024 TVS Apache RTR 160 | దేశీయ మార్కెట్లోకి 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్.. ధరెంతంటే..?!
2024 TVS Apache RTR 160 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
2024 TVS Apache RTR 160 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ తన 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1,28,720 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. బజాజ్ పల్సర్ ఎన్ 160, హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్, హోండా ఎస్పీ 160 మోటారు సైకిళ్లకు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ బైక్ గట్టి పోటీ ఇవ్వనున్నది.
ఈ మోటారు సైకిల్ మ్యాట్టె బ్లాక్ కలర్ స్కీం విత్ కార్బన్ ఫైబర్ రేస్ ఇన్స్పైర్డ్ గ్రాఫిక్స్‌తో 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ మోటారు సైకిల్ రూపుదిద్దుకున్నది. అంతే కాదు రేసింగ్ ఎడిషన్ లోగో, రెడ్ అల్లాయ్ వీల్స్ తో వస్తోందీ బైక్. టీవీఎస్ 2024 అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ బైక్ 159.7సీసీ, ఎయిర్ కూల్డ్, ఎఫ్ఐ ఇంజిన్ కలిగి ఉంటుంది. గరిష్టంగా 16.04 పీఎస్ విద్యుత్, 13.85 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బ్యాక్స్ తో రూపుదిద్దుకున్నది.
డబుల్ క్రెడిట్ సింక్రనైజ్డ్ స్టిఫ్ చేసిస్ ఆధారంగా రూపుదిద్దుకున్న 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక 5-స్టెప్ అడ్జస్టబుల్ షాక్స్ కలిగి ఉంటుంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్ లెస్ టైర్స్ కలిగి ఉంటది. వేరియంట్లను బట్టి ముందు 270 ఎంఎం ఫ్రంట్ డిస్క్, రేర్ లో 200 ఎంఎం డిస్క్/130 ఎంఎం డ్రమ్ డిస్క్ బ్రేకులు ఉంటాయి. స్పోర్ట్, అర్బన్, రైన్ మోడ్స్ లో వస్తున్న టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్-2024 మోటారు సైకిల్ డిజిటల్ ఎల్సీడీ క్లస్టర్ విత్ టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, టెయిల్ లాంప్, గ్లైడ్ థ్రూ టెక్నాలజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో బ్లూటూత్ విత్ వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ నేవిగేసన్, కాల్ లేదా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, రేస్ టెలిమిటీ తదితర సర్వీసులు అందిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

