టీమిండియాతో ఈసారి అంత ఈజీ కాదు : పాకిస్తాన్ మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు
గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైంది. అయితే ఈసారి ఇండియాను ఓడించడం మాత్రం అంత ఈజీ కాదని అంటున్నాడు ఆ జట్టు మాజీ పేసర్ షోయభ్ అక్తర్. ఈసారి ఇండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని బాబర్ ఆజమ్ సేనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
ఈ మ్యాచ్ పై ఇప్పటికే హైప్ వస్తున్న నేపథ్యంలో అక్తర్ మాట్లాడుతూ.. ‘ఈసారి టీమిండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుంది. రాబోయే టీ20 ప్రపంచకప్ లో భారత్ ను ఓడించడం పాకిస్తాన్ కు అంత తేలికైన విషయం కాదు..’ అని అన్నాడు.
ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు..? అనేదానిపై ఇరు జట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చలు సాగిస్తున్న తరుణంలో మ్యాచ్ ఫలితం గురించి చెప్పడానికి అక్తర్ నిరాకరించాడు. విజేతను ఇప్పుడే అంచనా వేయడం కష్టమే అని చెప్పుకొచ్చాడు
విజేత ఎవరో తేల్చలేకపోయిన అక్తర్.. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం రెండోసారి బౌలింగ్ కు దిగాలని సూచించాడు. ‘మెల్బోర్న్ పిచ్ పాతబడే కొద్దీ బౌలర్లకు అనుకూలిస్తుంది. కావున టాస్ గెలిస్తే భారత్ తొలుత బౌలింగ్ తీసుకోకూడదు..’ అని తెలిపాడు. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మ్యాచ్ ను వీక్షించడానికి సుమారు లక్షా యాభై వేల మంది ప్రేక్షకులు స్టేడియానికి వస్తారని అక్తర్ తెలిపాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ లో జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో భాగంగా అక్టోబర్ 16న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా గతేడాది టీ20 ప్రపంచకప్ లో ఓడి స్వదేశం చేరిన తర్వాత రోహిత్ సేన సారథ్యంలో భారత జట్టు అప్రతీహాత విజయాలతో కొనసాగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

