ISSF | న్యూఢిల్లీ: భారత్ వేదికగా వచ్చే ఏడాది ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఈ విషయాన్ని జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
ఇటీవలి సీనియర్ ప్రపంచకప్(2023), వరల్డ్కప్ ఫైనల్ తర్వాత భారత్లో జరుగనున్న మేజర్ అంతర్జాతీయ టోర్నీగా ఇది నిలువనుంది. దేశంలో షూటింగ్కు ఉన్న క్రేజ్, వసతి సౌకర్యాలు వరల్డ్కప్ ద్వారా మరింతగా ప్రాచుర్యంలోకి రానున్నాయి. మెగాటోర్నీకి సంబంధించి తేదీలు ఇంకా ఖరారు కాలేదు.