న్యూఢిల్లీ: జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ ఈవెంట్లో కనక్ పసిడి పతకంతో మెరిసింది.
మొత్తం ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో ఈ 17 ఏండ్ల హర్యానా షూటర్ 239.0 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండు సార్లు ఒలింపియన్ అన్నా డుల్సె(మాల్దోవా), చెన్ యెన్ చింగ్(చైనీస్ తైపీ) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.