Asia Cup | ఆసియా కప్‌లో దాయాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో జట్టు పరిస్థితి మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 28 ఓవర్లు ముగిసే సమయానికి ఇషాన్ కిషాన్ 49 పరుగులు, హార్దిక్ పాండ్యా 36 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టీం ఇండియా 140 పరుగులు చేసింది. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతోపాటు నలుగురు బ్యాటర్లు ఔటైనా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా నిలకడగా ఆడుతూ స్కోర్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
టాస్ గెలుచుకున్న టీం ఇండియా సారధి రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లీ 4, శ్రేయస్ అయ్యర్ 14, శుభ్ మన్ గిల్ 10 పరుగులకే ఔటయ్యారు. 66 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోవడంతో టీం పరిస్థితి చక్కదిద్దే బాధ్యతను ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా చేపట్టారు.
25 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అంతకుముందు వర్షం వల్ల రెండు దఫాలు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిది, హరిస్ రౌత్ చెరో రెండు వికెట్ల చొప్పన తీశారు.