ZIM vs IRE : జింబాబ్వే పర్యటనను ఐర్లాండ్(Ireland) ఘనంగా ముగించింది. పొట్టి సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌లోనూ విజేతగా అవతరించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్(HarareSports Club)లో ఆదివారం జరిగిన సిరీస్ డిసైడర్‌లో అద్భుత విజయంతో ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. కీలక పోరులో సమిష్టిగా రాణించిన పాల్ స్టిర్లింగ్(Paul Stirling) సేన 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా జింబాబ్వే గడ్డపై వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.
వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ ఆండ్రూ బాల్బిర్నీ(82 నాటౌట్ : 102 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్), కర్టిస్ కంఫెర్(40) దంచికొట్టారు. దాంతో, ఐర్లాండ్ 37.5 ఓవర్లలోనే విజయం సాధించింది.
First ODI series win for Ireland in Zimbabwe 🎉#ZIMvIRE | 📝: https://t.co/0w7ftoa5O8 pic.twitter.com/FAELMhrWAV
— ICC (@ICC) December 17, 2023
మూడో వన్డేలో ఐర్లాండ్ బౌలర్ల ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 197 పరుగులకే ఆలౌటయ్యింది. ఓపెనర్ జాయ్‌లార్డ్ గుంబీ(72), కెప్టెన్ సికిందర్ రజా(37) మాత్రమే రాణించారు. అనంతరం ఐర్లాండ్ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దాంతో, రిఫరీలు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఐర్లాండ్‌కు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఆండ్రూ బాల్బిర్నీ(82 నాటౌట్)
ఛేదనలో ఐర్లాండ్ ఓపెనర్ ఆండ్రూ బాల్బిర్నీ(82 నాటౌట్ 102 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్), మిడిలార్డర్లో వచ్చిన కర్టిస్ కంఫెర్(40) దంచికొట్టారు. దాంతో, ఐర్లాండ్ 37.5 ఓవర్లలోనే విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని, బ్రాండన్ మవుతా, ల్యూకె జాంగ్వే తలొక వికెట్ తీశారు.