viral video | డబ్బును సరైన రీతిలో ఖర్చు చేయడం అంటే ఇదే..!
లుధియానాకు చెందిన ఓ వ్యక్తి పండ్లు విక్రయించే వృద్ధురాలి నుంచి మొత్తం సరుకును కొనుగోలు చేసి ఆమె ముఖంలో నవ్వులు పూయించిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగవైరలవుతోంది.
చండీఘఢ్ : దయాగుణంతో కూడిన చిన్న పనులు కూడా ఒక్కోసారి నైరాశ్యాన్ని పారద్రోలి ఆశలను మొలకెత్తిస్తాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుండగా తాజాగా లుధియానాకు చెందిన ఓ వ్యక్తి పండ్లు విక్రయించే వృద్ధురాలి నుంచి మొత్తం సరుకును కొనుగోలు చేసి ఆమె ముఖంలో నవ్వులు పూయించిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగవైరలవుతోంది. బిజినెస్ కన్సల్టెంట్, లుధియానా లైవ్ వ్యవస్ధాపకుడు కవల్ చబ్రా ఆఫీసు నుంచి ఇంటికి వెళుతుండగా ఓ పెద్దావిడ చిన్న బండిపై పండ్లు విక్రయించడం కంటపడుతుంది.
పండ్ల ధరలు ఎంతో తెలుసుకునేందుకు ఆమె దగ్గరకు వెళ్లిన చబ్రా అన్ని వివరాలూ రాబడతాడు. గత మూడేండ్లుగా తాను ఇక్కడ పండ్లు అమ్ముతున్నానని, స్టాల్ వద్ద రోజుకు 12 గంటలు వెచ్చించినా మిగిలేది అరకొరేనని 62 ఏండ్ల మహిళ ఏకరువు పెడుతుంది. ఈరోజు కేవలం రూ. 100 మాత్రమే తనకు మిగిలాయని వాపోతుంది. పెద్దావిడకు సాయం చేసి ఆమె ముఖంలో నవ్వు పూయించాలని భావించిన కవల్ చబ్రా రూ. 3000 విలువైన పండ్లు అన్నింటినీ కొనుగోలు చేస్తాడు. కవల్ చేసిన పనికి నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు.
మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది బ్రదర్ అని ఓ యూజర్ కామెంట్ చేయగా, డబ్బును సరైన విధంగా ఖర్చు చేయడం అంటే ఇదేనని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చాడు. మీరు చిరకాలం జీవించాలని మరో నెటిజన్ కవల్ చబ్రాను బ్లెస్ చేశాడు. ఇక ఈ వీడియోకు ఏకంగా 50 లక్షల వ్యూస్ లభించాయి. అదేమాదిరిగా కవల్ చబ్రా గృహోపకరణాలను విక్రయిస్తున్న ఓ వృద్ధ విక్రేత నుంచి మొత్తం సరుకును కొనుగోలు చేసి ఆసరాగా నిలిచాడు.
Read More :
Explosion | సోలార్ కంపెనీలో పేలుడు.. తొమ్మిది మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

