Parliament: పార్లమెంట్లో విపక్షాల ఆందోళన.. ఉభయసభలు వాయిదా
Parliament: స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ సభలను వాయిదా వేశారు. ఇక సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్లమెంట్‌లోని మకర ద్వారం వద్ద నిరసన చేపట్టారు.
న్యూఢిల్లీ: లోక్‌సభలో జరిగిన స్మోక్ అటాక్ అంశంపై ఇవాళ పార్లమెంట్(Parliament)లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. భద్రతా వైఫల్యాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇవాళ ఉదయం రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది. తొలుత 11.30 వరకు చైర్మెన్ జగదీప్ వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఇక లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఇవాళ విపక్ష నేతలు రూల్ 267 కింద 22 నోటీసులు ఇచ్చారు. నోటీసులను తిరస్కరిస్తున్నట్లు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధంకర్ తెలిపారు.
సెక్యూర్టీ వైఫల్యం అంశంపై లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై రాజకీయం చేయడం శోచనీయమని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వెల్‌లోకి దూసుకువచ్చి.. నినాదాలు చేయడం సభా మర్యాదలకు విరుద్ధమని తెలిపారు. కీలకమైన అంశాలపై చర్చ చేపట్టేందుకు ప్రతిపక్షాల సహకారం అవసరమని ఓం బిర్లా అన్నారు. స్మోక్ అటాక్ ఘటనపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు ఏజెన్సీలు ఆ వ్యవహారాన్ని తేలుస్తాయన్నారు. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని లోక్‌సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఉభయసభల నుంచి సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్లమెంట్ మకర ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. హౌజ్‌లోకి ఎంటర్ అవుతున్న సమయంలో ద్వారం వద్ద ఉన్న ఆ ఎంపీలతో సోనియా గాంధీ మాట్లాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

