Irani Cup | లక్నో: ఇరానీ కప్లో రంజీ చాంపియన్ ముంబై జట్టు సాధించిన భారీ స్కోరు (537)కు రెస్టాఫ్ ఇండియా (ఆర్వోఐ) కూడా దీటుగా బదులిస్తోంది. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ మూడో రోజు ఆటలో భాగంగా ఆ జట్టు 74 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (212 బంతుల్లో 151 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో మెరిశాడు.
ఇషాన్ కిషన్ (38) ఫర్వాలేదనిపించగా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (30 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్లో ఆర్వోఐ ఇంకా 248 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 536/9తో మూడో రోజు ఆట ప్రారంభించిన ముంబై ఒక్క పరుగు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది.