IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ అందరికీ ఎలా ఉన్నా ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కెరీర్‌ను మాత్రం ప్రశ్నార్థకంలో పడేసింది. అసలే కెప్టెన్ నుంచి ఆటగాడిగా పరిమితమైన హిట్‌మ్యాన్‌ను ఒక వీడియో చిక్కుల్లో పడేసింది. తాను రికార్డు చేయవద్దని కోరినప్పటికీ స్టార్ స్పోర్ట్స్(Star Sports) వినలేదని, తన గోప్యత(Privacy)ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని రోహిత్ ఆరోపించాడు. అయితే.. సంస్థ స్టార్ స్పోర్ట్స్ మాత్రం తామే ఏమీ ఉద్దేశపూర్వకంగా ఆ వీడియో రికార్డు చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
‘సీనియర్ ఆటగాడైన రోహిత్ తన స్నేహితులతో సంభాషిస్తూ మా కంట పడ్డాడు. దాంతో, అతడి వైపు కెమెరా తిప్పాం. అంతేతప్ప రోహిత్ మాటల్ని ప్రత్యేకంగా మేము రికార్డు చేయలేదు. అతడి గోప్యతకు భంగం కలిగించలేదు’ అని స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. మరి.. ఇప్పుడు రోహిత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
KKR posted and deleted this video..
Is this the last season of Rohit Sharma in Mumbai Indians??#RohitSharma pic.twitter.com/gVkCzAtn2w pic.twitter.com/Y4NJTuZQeD
— Sports Sarai (@SportsSarai) May 11, 2024
మే 11న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో మ్యాచ్ అనంతరం ఆ జట్టు అసిస్టెంట్ కోచ్అభిషేక్ నాయర్ (Aabhishek Nair)తో హిట్‌మ్యాన్ మాట్లాడాడు. ఆ వీడియోలో అతడు పరిస్థితులు మారాయి. ముంబైతో తన భవిష్యత్ గురించి అతడితో చర్చించాడు. ఆ సంభాషణ వీడియో నెట్టింట తెగ తిరగడంతో.. అతడు ముంబైని వీడుతాడనే వార్తలు జోరందుకున్నాయి. ఆ తర్వాత మే 15న లక్నో పేసర్ ధవల్ కులకర్ణి(Dhaval Kulkarni) తో రోహిత్ మాట్లాడుతున్నాడు. కెమెరావాళ్లను గమనించిన అతడు ఆడియో ఆఫ్ చేయాలని కోరాడు. ‘దయచేసి ఆడియో రికార్డు ఆఫ్ చేయండి. ఇప్పటికే ఒక ఆడియో నన్ను ఇబ్బందుల్లో పడేసింది’ అని రోహిత్ వాళ్లతో అన్నాడు.
Rohit Sharma today 🤣🤣 Bhai,Audio band kar ek audio ne Mera watt laga diya hai
After his audio viral in with KKR batting coach related his captaincy in MI#MIvsLSG #LSGvsMI #RCBvsCSK#RCBvCSK #Kalki289AD #Hitman #JaspritBumrah #BCCI #RohitSharma#INDIAalliace #Kanhaiyakumar pic.twitter.com/UOdq3eU1YA— Suvikas yadav (@SuvikasYadav) May 17, 2024
ఐపీఎల్ గొప్ప కెప్టెన్లలో ఒకడైన రోహిత్ ఈసారి కెప్టెన్సీ లేకుండా ఆడాడు. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్ పదిహేడో సీజన్లో హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) సారథ్యంలో మైదానంలోకి దిగాడు. ఫ్రాంచైజీ నిర్ణయంతో బాధపడినప్పటికీ అదేదీ కనిపించకుండా ముంబైకి శుభారంభాలు ఇచ్చాడు.
వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్‌పై శతక గర్జన చేసిన రోహిత్.. ఆఖరి మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో మెరిశాడు. అయితే.. ఈ ఏడాది మూడంటే మూడు విజయాలకే పరిమితమైన ముంబై ప్లే ఆఫ్స్ నుంచి వైదొలిగింది. దాంతో, రోహిత్ ఇక టీ20 వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టనున్నాడు. అతడితో పాటు మరికొందరు మే 25న న్యూయార్క్ విమానం ఎక్కనున్న విషయం తెలిసిందే.