హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విత్తన ఎగుమతులకు మంచి అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ చెప్పారు. బుధవారం తన కార్యాలయంలో విత్తన ధ్రువీకరణ అధికారుల అసోసియేషన్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేంద్రమోహన్ మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్-2047కు అనుగుణంగా విత్తన ఎగుమతులను మరింత పెంచాలని, అందుకోసం తగిన ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాలకు ఏఐసీసీ పరిశీలకులను కాంగ్రెస్ నియమించింది. తమిళనాడు, పాండిచ్చేరిలకు మంత్రి ఉత్తమ్‌ను ఎంపిక చేసింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలకు ట్రాఫిక్ మేనేజ్మెంట్పై రిటైర్డ్ డీజీపీ జితేందర్ అవగాహన కల్పించారు. డీజీ అభిలాష బిస్త్ ఆహ్వానం మేరకు ఆయన బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 7 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. రవి నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు అధికారులు తెలిపారు. చార్జిషీట్ దాఖలుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.