Srikanth | బెంగళూరు (Bengaluru) సమీపంలో నిన్న జరిగిన రేవ్‌పార్టీ (Rave Party) విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో మందు, భారీగా మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు యాక్టర్లు, మోడళ్లు పట్టుబట్టారంటూ వార్తలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి.
కాగా ఈ రేవ్ పార్టీలో తాను కూడా ఉన్నట్టు వచ్చిన వార్తలపై టాలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ (Srikanth) స్పందించాడు. బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీకి తనకెలాంటి సంబంధం లేదని.. తాను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లోనే ఉన్నా. నేను రేవ్ పార్టీకి వెళ్లినట్టు, పోలీసులు అరెస్ట్ చేసినట్టు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు.
కొందరు మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో వాళ్లు నాకు సంబంధించిన వార్తలు రాయలేదు. నాపై వస్తున్న వార్తలు అవాస్తవం. కొన్ని మాధ్యమాల్లో నేను రేవ్ పార్టీకి వెళ్లానంటూ వార్తలు రావడంతో.. నాకు నవ్వొచ్చింది.. మా ఫ్యామిలీ అంతా నవ్వుకున్నాం. మొన్నమో విడాకులిప్పించేశారు. వీడియోలు కూడా చూశాను. ఓ వీడియో క్లిప్పులో ఎవరో ఒకతను గడ్డంను కవర్ చేస్తూ నాలాగే అనిపించడం చూసి షాకయ్యా..రేవ్ పార్టీలకు వెళ్లే కల్చర్ కాదు నాది కాదంటూ షేర్ చేసిన వీడియోపై నెట్టింట వైరల్ అవుతోంది.
*రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని నేను కాదు.. తప్పుడు కథనాలను నమ్మకండి – నటుడు శ్రీకాంత్*
@actorsrikanth #Srikanth #Tollywood pic.twitter.com/ZnoyXpI5ll
— Suresh Kondeti (@santoshamsuresh) May 20, 2024