IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు గుడ్‌న్యూస్. మహిళల ప్రీమియర్ లీగ్(WPL) వేలం తేదీలను ప్రకటించిన బీసీసీఐ (BCCI) ఐపీఎల్‌కు కూడా పచ్చజెండా ఊపింది. డిసెంబర్ 15వ తేదీన పంతొమ్మిదో సీజన్ వేలం నిర్వహణకు బీసీసీసీఐ సిద్ధమవుతోంది. ఒకవేళ ఆ రోజు కాకుంటే డిసెంబర్ 13-15 మధ్య కచ్చితంగా ఆక్షన్ ఉంటుందని సమాచారం. అయితే.. వేలం తేదీని ఫ్రాంచైజీలతో మాట్లాడి బీసీసీఐ ఖరారు చేయాల్సి ఉంది.
గత రెండు సీజన్లలో విదేశాల్లోనే వేలం నిర్వహించారు. మరి, ఈసారి అదే పంథాను అనుసరిస్తారా? లేదంటే.. స్వదేశంలోనే ఈ క్రతువును పూర్తి చేస్తారా? అనేది తెలియడం లేదు. పదిహేడో సీజన్ వేలంను దుబాయ్‌లో, 18వ సీజన్ మెగా వేలాన్ని సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిపిన విషయం తెలిసిందే.
#IPL AUCTION UPDATE#Auction to be held around 13-15th December. – 15th November set to be the deadline to finalise retention.#IPL2026 pic.twitter.com/EE3OGefb6T
— Attention India (@attentionindia1) October 10, 2025
ఐపీఎల్ వేలం వస్తోందంటే చాలు.. ప్రతిభావంతులపై కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు రెఢీ అవుతుంటాయి. రికార్డు ధర పలికేది ఎవరు? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత సీజన్లో రిషభ్ పంత్ రూ.27 కోట్లతో అత్యధిక ధర పలకగా.. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ అట్టిపెట్టుకుంది.