IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ పంతొమ్మిదో సీజన్ వేలం డిసెంబర్లో జరుగనున్న విషయం తెలిసిందే. ఆ నెల రెండో వారంలో వేలం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే.. ఈసారి వేలం నిర్వహణ ఎక్కడ? అనే విషయంలో మాత్రం ఇప్పటివరకూ స్పష్టత రావడం లేదు. గత రెండు సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా విదేశాల్లోనూ జరుగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
పదిహేడో సీజన్ వేలంను దుబాయ్‌లో, 18వ సీజన్ మెగా వేలాన్ని సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరిపిన విషయం తెలిసిందే. పంతొమ్మిదో సీజన్ వేలం ప్రక్రియను యూఏఈలోని అబూదాబీలో నిర్వహిస్తారని టాక్. ఒకవేళ అక్కడ వద్దనుకుంటే ఒమన్ లేదంటే ఖతార్‌లో వేలం జరిపే అవకాశముంది.
The IPL 2026 mini-auction is expected to be held between December 13 and 15, with the player retention deadline set for November 15, 2025. Official confirmation from the IPL Governing Council is still pending. pic.twitter.com/RtnAHuJKGB
— Random Things (@randomthing_RT) November 1, 2025
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం డిసెంబర్ 15వ తేదీన పంతొమ్మిదో సీజన్ వేలం నిర్వహణకు బీసీసీసీఐ సిద్ధమవుతోంది. ఒకవేళ ఆ రోజు కాకుంటే డిసెంబర్ 13-15 మధ్య కచ్చితంగా ఆక్షన్ ఉంటుందని సమాచారం. అయితే.. వేలం తేదీని ఫ్రాంచైజీలతో మాట్లాడి బీసీసీఐ ఖరారు చేయాల్సి ఉంది.
ఐపీఎల్ వేలంలో ప్రతిభావంతులపై కోట్లు కురుస్తాయి. మ్యాచ్ విన్నర్లను కొనేందుకు ఫ్రాంచైజీలు సిద్దమవుతాయి. అందుకే ప్రతిసారి రికార్డు ధర పలికేది ఎవరు? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గత సీజన్లో రిషభ్ పంత్ రూ.27 కోట్లతో అత్యధిక ధర పలకగా.. శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ అట్టిపెట్టుకుంది.