IPL 2025 | ఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వారం రోజుల పాటు వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పున:ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే 17వ తేదీ నుంచి లీగ్‌ను తిరిగి ప్రారంభించనుంది. ఈ మేరకు రీషెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్ 2025లో మిగిలిన 17 మ్యాచ్‌ల కోసం ఆరు వేదికలను ఖరారు చేసింది. దాయాది దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించడంతో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరం బీసీసీఐ రీషెడ్యూల్‌ను ఖరారు చేసింది.
మే 29వ తేదీన క్వాలిఫయర్ 1, మే 30వ తేదీన ఎలిమినేటర్, జూన్ 1వ తేదీన క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్‌ను నిర్వహించనున్నారు. అయితే ఈ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు ఇంకా వేదికలను ఖరారు చేయలేదు. మిగిలిన మ్యాచ్‌లు మాత్రం బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, ముంబై, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.
కొత్త షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌ల వివరాలు
మే 17వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (బెంగళూరు)
మే 18వ తేదీన రాజస్థాన్ రాయల్స్ vs పంజాబ్ కింగ్స్ (జైపూర్)
మే 18వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్(ఢిల్లీ)
మే 19వ తేదీన లక్నో సూపర్‌జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్(లక్నో)
మే 20వ తేదీన చెన్నై సూపర్‌కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్(ఢిల్లీ)
మే 21వ తేదీన ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (ముంబై)
మే 22వ తేదీన గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్‌జెయింట్స్ (అహ్మదాబాద్)
మే 23వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ (బెంగళూరు)
మే 24వ తేదీన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ ( జైపూర్)
మే 25వ తేదీన గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్‌కింగ్స్ (అహ్మదాబాద్)
మే 25వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (ఢిల్లీ)
మే 26వ తేదీన పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ (జైపూర్)
మే 27వ తేదీన లక్నో సూపర్‌జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (లక్నో)