Rishabh Pant | ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కెప్టెన్‌గా భారత జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) నియామకమయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా (Sanjiv Goenka) వెల్లడించారు. రాబోయే ఐపీఎల్లో పంత్ అంత్య విజయవంతమైన కెప్టెన్‌గా నిలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు గొయెంకా. ఇటీవల జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో లక్నో జట్టు రూ.27కోట్లు పోసి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025 సీజన్ ఈ ఏడాది మార్చి చివరి వారంలో మొదలుకానున్నది. ఈ సీజన్‌కు రిషబ్ పంత్‌ను జట్టు యాజమాన్యం నియమించింది. గత సీజన్ వరకు లక్నో జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ కొనసాగాడు. లక్నో కేఎల్ రాహుల్‌ను రిటైన్ చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఇక రిషబ్ పంత్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కొనసాగిన విషయం తెలిసిందే.
రిషబ్ పంత్ ఢిల్లీకి 2016 నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. 110 మ్యాచ్‌ల్లో 35.31 సగటుతో 3,284 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. పంత్ 2021లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే సీజన్లో జట్టును ప్లేఆఫ్ వరకు చేర్చాడు. IPL 2025 సీజన్ కోసం మెగా వేలానికి ముందు, లక్నో నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోనిని రీటెన్ చేసుకుంది. గత సీజన్ లక్నోకు ఏమాత్రం కలిసిరాలేదు. 14 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఏడు ఓటములతో 14 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
Kho Kho World Cup 2025 | ఇది దేశం గర్వించదగ్గ క్షణం.. ఖోఖో టీమ్‌లకు రాజమౌళి, మహేశ్ శుభాకాంక్షలు