IPL 2025 : క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఐపీఎల్ 18వ సీజన్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. భారత్, పాకిస్థాన్‌లు కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించడంతో తదుపరి మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ (BCCI) సిద్ధమవుతోంది. మే 16వ తేదీ నుంచి లీగ్‌ను పునరుద్దరించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకోసం త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రకటించనుంది. ఫైనల్ ఫైట్ మే 30న లేదంటే జూన్ 1 న జరగునందని సమాచారం. అయితే.. ముందగా నిర్ణయించినట్టు ఫైనల్ మాత్రం ఈడెన్ గార్డెన్స్‌లో జరగదనే వార్తలు వినిపిస్తున్నాయి.
సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ను వారం రోజులు వాయిదా వేస్తున్నట్టే మే 9న బీసీసీఐ ప్రకటించింది. పరిస్థితులు ఇలానే కొనసాగితే లీగ్‌ను మొత్తానికే రద్దు చేయడం లేదా దక్షిణాది రాష్ట్రాలో నిర్వహించాలని భారత బోర్డు భావించింది. అయితే.. మే 10న ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దాంతో, మే 16, 17 నుంచి లీగ్‌ను జరిపేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. ఇదే విషయమై ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సమాచారాన్ని ఇచ్చింది బీసీసీఐ.
IPL 2025 resumes on May 16 with the final likely by June 1.
Matches to be held across Chennai, Bengaluru, Hyderabad; Punjab Kings to play at a neutral venue.
Franchises asked to report by May 13 as BCCI plans a tighter schedule with more double-headers.#IPL2025 #CricketNews… pic.twitter.com/Bhl26WRfnr
— Mid Day (@mid_day) May 11, 2025
‘కాల్పుల విరమణ వార్త తెలియగానే ఐపీఎల్ చైర్మన్, బీసీసీఐ అధికారులు సమావేశం అయ్యారు. వాయిదా పడిన ఐపీఎల్ పునరుద్ధరణపై ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. ఫ్రాంచైజీలతో పాటు, బ్రాండ్కాస్టింగ్ సంస్థలతో మాట్లాడి కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తాం. అందరూ కోరుకుంటున్నట్టే లీగ్‌ను త్వరితగతిన పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించాడు.
RCB back on top of the table!🔴🔝
First team to reach 16 points in IPL 2025 1️⃣6️⃣✅ pic.twitter.com/wsg2UCZw8a
— CricketGully (@thecricketgully) May 3, 2025
ఐపీఎల్ కొత్త షెడ్యూల్ వస్తే.. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో క్రికెట్ పండుగ మళ్లీ అభిమానులను అలరించనుంది. హైదరాబాద్‌లో క్వాలిఫయర్ 1, కోల్‌కతాలో క్వాలిఫయర్ 2 జరిగే అవకాశముంది. మే 30 లేదా జూన్ 1 నిర్వహించే ఫైనల్‌తో విజేత ఎవరో తేలిపోనుంది. నాలుగు ప్లే ఆఫ్స్ బెర్తులకు 7 జట్లు పోటీపడుతున్న విషయం తెలిసిందే.