IPL Prize Money | ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగులు తేడాతో విజయం సాధించి తొలిసారి కప్‌ను గెలిచింది. రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ టైటిల్‌ని నెగ్గింది. ఈ మ్యాచ్ తర్వాత ప్రజంటేషన్ వేడుకల్లో విజేత ఆర్సీబీ, రన్నరప్ పంజాబ్ కింగ్స్‌తో పలువురు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీని ఇచ్చింది. అయితే, రన్నరప్ పంజాబ్ కింగ్స్‌కు రూ. 12.5 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
పంజాబ్ కోచ్, సపోర్ట్ స్టాఫ్ రన్నరప్ షీల్డ్, ఐపీఎల్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌లను అందుకున్నారు. ఐపీఎల్లో ఖర్చు చేసిన మొత్తంతో లీగ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఐపీఎల్లో విజేతలతో పాటు పలు అవార్డులు సైతం ఇచ్చే విషయం తెలిసిందే. ఇందులో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, ఫెయిర్ ప్లే అవార్డులు ఉన్నాయి. ఈ సారి ఆరెంజ్ క్యాప్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్‌కు దగ్గింది. ఈ సీజన్లో 759 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇక మరో గుజరాత్ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణకు పర్పుల్ క్యాప్ దక్కింది. ఈ సీజన్లో 25 వికెట్లు పడగొట్టాడు. ఇద్దరికీ రూ.10లక్షల చొప్పున బీసీసీఐ క్యాష్ రివార్డును అందించింది.
జితేశ్ శర్మ (సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష రివార్డు
శశాంక్ సింగ్ (ఫాంటసీ కింగ్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష రివార్డు
శశాంక్ సింగ్ (సూపర్ సిక్సర్స్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష రివార్డు
ప్రియాన్ష్ ఆర్యా (మ్యాచ్‌లో అత్యధిక ఫోర్లు) రూ.లక్ష రివార్డు
కృనాల్ పాండ్యా (గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్) రూ.లక్ష రివార్డు
కృనాల్ పాండ్యా (మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్) రూ.5లక్షల పారితోషకం
సాయి సుదర్శన్ (ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల రివార్డు
వైభవ్ సూర్యవంశి (సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ది సీజన్) టాటా కర్వ్ కారు విజేత
సాయి సుదర్శన్ ( ఫాంటసీ కింగ్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షల రివార్డు
నికోలస్ పూర్ (సూపర్ సిక్సెస్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షలు
సాయి సుదర్శన్ (ది గో ఫోర్స్ ఆఫ్ ది సీజన్) రూ.10 లక్షలు క్యాష్ ప్రైజ్
మొహ్మద్ సిరాజ్ (గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల రివార్డు
కమిండు మెండిస్ (క్యాచ్ ఆఫ్ ది సీజన్) రూ. 10 లక్షల క్యాష్ ప్రైజ్
ఫెయిర్ ప్లే అవార్డు (చెన్నై సూపర్ కింగ్స్) రూ.10లక్షల ప్రైజ్‌మనీ
ప్రసిద్ధ్ కృష్ణ (పర్పుల్ క్యాప్) రూ.10లక్షల రివార్డ్
సాయి సుదర్శన్ (ఆరెంజ్ క్యాప్) రూ.10లక్ష రివార్డ్
సూర్యకుమార్ యాదవ్ (మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్) రూ.15లక్షల రివార్డు
డీడీసీఏ (పిచ్ అండ్ గ్రౌండ్) రూ.50లక్షలు
Virat Kohli | కోహ్లీ 18 ఏండ్ల కల సాకారం.. భావోద్వేగానికి లోనైన దిగ్గజ క్రికెటర్
IPL 2025 | ఈ సాలా కప్ ఆర్సీబీదే.. ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్‌పై ఉత్కంఠ విజయం