GT vs RR | లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. మూడో ఓవర్ ముగిసేలోపే రెండు వికెట్లను కోల్పోయింది. రెండో ఓవర్లో బంతికి జైశ్వాల్(6) వికెట్‌ను కోల్పోగా.. మూడో ఓవర్లో బంతికి నితీశ్ రాణా (1) ఔటయ్యాడు.
అర్షద్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో రెండో బంతికి రషీద్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి జైశ్వాల్ వెనుదిరిగాడు. మూడో ఓవర్లో సిరాజ్ వేసిన రెండో బంతికి నితీశ్ రాణా క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులో సంజూ శాంసన్ (1), రియాన్ పరాగ్ (6) ఉన్నారు. మూడో ఓవర్ ముగిసేరికి రాజస్థాన్ స్కోర్ 18/2.