ఢిల్లీ: ఐపీఎల్ వేలం ప్రక్రియను మరోసారి విదేశాల్లో నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. డిసెంబర్ 15 లేదా 16 తారీఖున అబుదాబి వేదికగా వేలాన్ని నిర్వహించనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. ఒకవేళ అదే నిజమైతే గల్ఫ్ దేశాల్లో ఐపీఎల్ వేలం నిర్వహించడం ఇది మూడోసారి (2023లో దుబాయ్, 2024లో సౌదీ అరేబియా) అవుతుంది.