IPL 2024 | అట్కిన్సన్ ఔట్.. లంక పేసర్‌ను తీసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్
IPL 2024 | కొద్దిరోజుల క్రితమే దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్.. అట్కిన్సన్ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఒకవేళ నెక్స్ట్ సీజన్లో ఆడుంటే అతడికి ఇదే తొలి ఐపీఎల్ సీజన్ అయ్యుండేది.
IPL 2024 | వచ్చే నెల నుంచి మొదలుకావాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 17లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ గుడ్ బై చెప్పాడు. వర్క్‌లోడ్ కారణంగా అట్కిన్సన్.. ఐపీఎల్ మిస్ అవనున్నాడు. అతడి స్థానంలో శ్రీలంక పేసర్ దుష్మంత చమీరను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. ఈ మేరకు ఐపీఎల్‌తో పాటు కేకేఆర్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటనలు విడుదల చేశాయి. చమీరను రూ. 50 లక్షల రిజర్వ్ ధరకు కేకేఆర్ దక్కించుకుంది.
శ్రీలంక పేసర్ చమీర.. 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. తన తొలి సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడిన చమీర.. 2021వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2022లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రధాన బౌలర్‌గా ఉన్నాడు. ఆ సీజన్లో అతడు 9 వికెట్లు పడగొట్టాడు.
🚨 NEWS 🚨@KKRiders name Dushmantha Chameera as replacement for Gus Atkinson.
More details 🔽 #TATAIPLhttps://t.co/ioBPp22mGi
— IndianPremierLeague (@IPL) February 19, 2024
కొద్దిరోజుల క్రితమే దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలంలో కేకేఆర్.. అట్కిన్సన్ను కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. ఒకవేళ నెక్స్ట్ సీజన్లో ఆడుంటే అతడికి ఇదే తొలి ఐపీఎల్ సీజన్ అయ్యుండేది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ టెస్టు జట్టుతో ఉన్న అట్కిన్సన్.. మూడు మ్యాచ్‌లలో ఒక్కదాంట్లో కూడా ఆడలేదు. భారత్‌తో టెస్టు సిరీస్ కారణంగా అతడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కూడా మిస్ అయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

