సెయింట్ లూసియా: టీ20 వరల్డ్‌కప్(T20 Worldcup)లో శ్రీలంక భారీ విజయాన్ని నమోదు చేసింది. 83 రన్స్ తేడాతో ఆ జట్టు నెదర్లాండ్స్‌పై గెలుపొందింది. గ్రూప్ డీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో.. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 201 రన్స్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ 15 బంతుల్లో 30, హసరంగ 10 బంతుల్లో 20 రన్స్ చేశారు. చరిత్ అసలంక శరవేగంగా 21 బంతుల్లో 46 రన్స్ చేసి లంకకు భారీ స్కోర్‌ను అందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అసలంక తన ఇన్నింగ్స్‌లో అయిదు సిక్సర్లు బాదాడు. ఓపెనర్ మెండిస్ కూడా 46 రన్స్ చేశాడు. 202 రన్స్ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ కేవలం 118 పరుగులకు ఆలౌటైంది. నిజానికి ఓపెనర్లు మైఖేల్ లివిట్, మ్యాక్స్ ఓదౌడ్లు 4.2 ఓవర్లలో 45 రన్స్ స్కోర్ చేశారు. కానీ ఓదౌడ్ ఔటైన తర్వాత నెదర్లాండ్స్ బ్యాటర్లు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. నువాన్ తుషారా మూడు, పతిరన రెండేసి వికెట్లు తీసుకున్నారు.
Sri Lanka sign off the #T20WorldCup with a comfortable win over Netherlands 👏#SLvNED: https://t.co/8emxMgGCqW pic.twitter.com/UblMPk95oW
— T20 World Cup (@T20WorldCup) June 17, 2024