లౌడర్‌హిల్: టీ20 వరల్డ్‌కప్(T20 Worldcup)లో పాకిస్థాన్ విజయం సాధించింది. గ్రూప్ ఏ లో భాగంగా ఇవాళ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతికష్టంమీద పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. సూపర్-8 స్టేజ్‌కు అర్హత కోల్పోయిన పాకిస్థాన్.. చివరకు ఓ విజయాన్ని అందుకుని సేద తీరింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 9 వికెట్లకు 106 రన్స్ మాత్రమే చేసింది. పాక్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది 22 రన్స్ చేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు.. టార్గెట్‌ను అందుకునేదికు కష్టాలు పడింది. బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్న పాకిస్థాన్ ఓ దశలో 62 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ మ్యాచ్‌ను కూడా పాక్ కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు సంకేతాలు అందాయి. కానీ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 32 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అబ్బాస్ అఫ్రిది 17 రన్స్ చేయగా.. చివరలో షాహీన్ అఫ్రిది రెండు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించాడు. అయిదు జట్లు ఉన్న ఏ గ్రూప్‌లో పాకిస్థాన్ మూడవ స్థానంలో నిలిచింది. ఇండియా, అమెరికా చేతిలో పాక్ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఐర్లాండ్ ఒక్క పాయింట్‌తో చివరి స్థానంలో నిలిచింది.
Pakistan hold their nerve in Florida 🙌
Skipper Babar Azam’s steely knock helps them clinch a thriller against Ireland 👏#T20WorldCup | #PAKvIRE | 📝: https://t.co/LlWP57Iklv pic.twitter.com/TeIlzpOBRZ
— T20 World Cup (@T20WorldCup) June 16, 2024