IPL 2023 : ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీ(103 నాటౌట్ : 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో చెలరేగాడు. విధ్వంసక బ్యాటింగ్ చేసిన అతడు శతకంతో ముంబై ఇండియన్స్‌కి భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత బౌలర్లు విజృంభించడంతో గుజరాత్ 191కి పరిమితమైంది. రషీద్ ఖాన్(79 నాటౌట్ : 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) వీరోచిత బ్యాటింగ్ చేశాడు. డేవిడ్ మిల్లర్(41) దంచి కొట్టినా సరిపోలేదు. వరుసగా రెండో విజయంతో రోహిత్ సేన రాజస్థాన్ రాయల్స్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరింది.
టీ20ల్లో మేటి బ్యాటర్ అయిన సూర్య ఐపీఎల్లో మొదటి సెంచరీ బాదాడు. అతడు మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ముంబై 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా(2), శుభ్‌మన్ గిల్(6) తక్కువకే ఔటయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(4), అభినవ్ మనోహర్(2) విఫలమయ్యారు. డేవిడ్ మిల్లర్(41), విజయ్ శంకర్(29) మాత్రమే రాణించారు. ముంబై బౌలర్లలో అకాశ్ మంధ్వాల్ 3, పీయూష్ చావ్లా, కార్తికేయ 2 వికెట్లు తీశారు.
Maiden IPL 5️⃣0️⃣ 👏
This has been some knock by @rashidkhan_19 👌
Follow the Match: https://t.co/o61rmJX1rD#TATAIPL | #MIvGT pic.twitter.com/nrr2fZlAuX
— IndianPremierLeague (@IPL) May 12, 2023
ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్(31), రోహిత్ శర్మ(29)ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే.. పవర్ ప్లే తర్వాత రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఔట్ చేశాడు. గత మ్యాచ్‌లో దంచికొట్టిన నేహల్ వధేర(15)ను బౌల్ట్ చేశాడు. విష్ణు వినోద్(30), ఔటయ్యాడు. టిమ్ డేవిడ్(5) విఫలమయ్యారు. బ్యాటింగ్ పిచ్‌పై రషీద్ ఖాన్ 4 వికెట్లతో సత్తా చాటాడు.