IPL-2023 GT vs KKR | గుజరాత్ టైటన్స్‌పై కోల్‌కతా బంపర్ విక్టరీ.. చివరి ఓవర్లో 5 సిక్సులు కొట్టిన రింకూ సింగ్
IPL-2023 GT vs KKR Live Update | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ - కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగున్నది. గుజరాత్ ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో రెండింట్లో గెలుపొందింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలుపొందాలని భావిస్తున్నది.
ఐపీఎల్ 16వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన విజయం నమోదు చేసింది. రింకూ సింగ్(48) ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. అతను సిక్సర్ల మోత మోగించడంతో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 29 రన్స్ కావాలి. యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్ రెండో బంతికి రింకూ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, కోల్‌కతా ఆటగాళ్లు పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చారు. వరుస రెండు విజయాలతో ఊపు మీదున్న గుజరాత్‌కు ఇది తొలి ఓటమి.
-
09 Apr 2023 07:26 PM (IST)
రింకూ సింగ్ సిక్సర్ల మోత.. ఉత్కంఠ పోరులో కోల్‌కతా సంచలన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన విజయం నమోదు చేసింది. రింకూ సింగ్(48) ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. అతను సిక్సర్ల మోత మోగించడంతో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 29 రన్స్ కావాలి. యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్ రెండో బంతికి రింకూ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టాడు. దాంతో, కోల్‌కతా ఆటగాళ్లు పరుగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చారు. వరుస రెండు విజయాలతో ఊపు మీదున్న గుజరాత్‌కు ఇది తొలి ఓటమి.
-
09 Apr 2023 07:13 PM (IST)
19 ఓవర్లకు స్కోర్
జోష్ లిటిల్ వేసిన 19వ ఓవర్లో రింకూ సింగ్(18) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. ఆఖరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 29 రన్స్ కావాలి.
-
09 Apr 2023 07:01 PM (IST)
రషీద్ ఖాన్ హ్యాట్రిక్
గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. 17వ ఓవర్లో వరుస మూడు బంతుల్లో డేంజరస్ ఆండ్రూ రస్సెల్(1), సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్‌ను పెవిలియన్ పంపాడు. దాంతో, ఈసీజన్లో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
-
09 Apr 2023 06:57 PM (IST)
ఐదో వికెట్ డౌన్
డేంజరస్ ఆండ్రూ రస్సెల్(1)ను రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. కీపర్ శ్రీకర్ భరత్ క్యాచ్ పట్టడంతో రస్సెల్ వెనుదిరిగాడు.
-
09 Apr 2023 06:52 PM (IST)
వెంకటేశ్ అయ్యర్ ఔట్
అల్జారీ జోసెఫ్ మరోసారి కోల్‌కతాను దెబ్బకొట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(83)ను ఔట్ చేశాడు. బౌండరీ వద్ద శుభ్‌మన్ గిల్ క్యాచ్ పట్టడంతో అయ్యర్ వెనుదిరిగాడు. దాంతో, 154 రన్స్ వద్ద కోల్‌కతా నాలుగో వికెట్ పడింది. కోల్‌కతా విజయానికి 25 బంతుల్లో 51 పరుగులు కావాలి.
-
09 Apr 2023 06:45 PM (IST)
15 ఓవర్లకు స్కోర్
జోష్ లిటిల్ ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(79) చెలరేగాడు. రెండు బౌండరీలు, ఒక సిక్స్ కొట్టాడు. రింకూ సింగ్(2) క్రీజులో ఉన్నారు. దాంతో, 17 రన్స్ వచ్చాయి. 15 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్.. 149/2 కోల్‌కతా విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాలి.
-
09 Apr 2023 06:35 PM (IST)
బిగ్ వికెట్ తీసిన జోసెఫ్
అల్జారీ జోసెఫ్ బిగ్ వికెట్ తీశాడు. ధాటిగా ఆడుతున్న నితీశ్ రానా(45)ను పెవిలియన్ పంపాడు. మిడాన్‌లో షమీ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. దాంతో, 100 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(61), రింకూ సింగ్ క్రీజులో ఉన్నారు.
A much-needed breakthrough for @gujarat_titans! 👌 👌
Alzarri Joseph scalps his first wicket of the match 👍 👍#KKR lose their captain Nitish Rana.
Follow the match ▶️ https://t.co/G8bESXjTyh #TATAIPL | #GTvKKR pic.twitter.com/vVVkhVVP6O
— IndianPremierLeague (@IPL) April 9, 2023
-
09 Apr 2023 06:33 PM (IST)
రషీద్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు
రషీద్ ఖాన్ వేసిన 13 వ ఓవర్లో నితీశ్ రానా(45) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(61) క్రీజులో ఉన్నాడు.13 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్.. 128/2
-
09 Apr 2023 06:33 PM (IST)
కోల్‌కతా స్కోర్ వంద
ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(58), నితీశ్ రానా(36) దంచి కొడుతున్నారు. యశ్ దయాల్ ఓవర్లో బౌండరీతో అయ్యర్ ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.ఆ తర్వాత బంతిని మిడ్ వికెట్ దిశగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఆఖరి బంతికి రానా సిక్స్ బాదాడు. దాంతో, స్కోర్ వంద దాటింది. 9 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్.. 116/2
5⃣0⃣ up for @venkateshiyer 👏 👏
1⃣0⃣0⃣ up for @KKRiders in the chase 👌 👌
Follow the match ▶️ https://t.co/G8bESXjTyh #TATAIPL | #GTvKKR pic.twitter.com/xQTgPGuuSv
— IndianPremierLeague (@IPL) April 9, 2023
-
09 Apr 2023 06:27 PM (IST)
అయ్యర్ హాఫ్ సెంచరీ
ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(52) హాఫ్ సెంచరీ కొట్టాడు. యశ్ దయాల్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. 25 బంతుల్లోనే అతను ఐదు ఫోర్లు,మూడు సిక్స్‌లతో యాభైకి చేరువయ్యాడు.
-
09 Apr 2023 06:15 PM (IST)
9 ఓవర్లకు స్కోర్
రషీద్ ఖాన్ వేసిన తొమ్మిదో ఓవర్లో ఒక బౌండరీ వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(33) నితీశ్ రానా(24) క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్.. 78/2
-
09 Apr 2023 06:11 PM (IST)
8వ ఓవర్లో రెచ్చిపోయిన రానా
అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో నితీశ్ రానా(18) మిడ్ వికెట్లో, ఆప్ సైడ్ రెండు భారీ సిక్స్‌లు బాదాడు. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(29) క్రీజులో ఉన్నాడు. దాంతో, 12 రన్స్ వచ్చాయి. 8 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్.. 68/2
-
09 Apr 2023 06:06 PM (IST)
7వ ఓవర్లో ఫోర్, సిక్స్
యశ్ దయాల్ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(29) చెలరేగాడు. వరుసగా బౌండరీ, సిక్స్ కొట్టాడు. దాంతో, రన్స్ వచ్చాయి. నితీశ్ రానా(6) క్రీజులో ఉన్నాడు. 7 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్.. 56/2
-
09 Apr 2023 06:00 PM (IST)
పవర్ ప్లేలో కోల్‌కతా స్కోర్
అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్(18) బౌండరీ కొట్టాడు. నితీశ్ రానా(4) క్రీజులో ఉన్నాడు. 6 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్.. 43/2
-
09 Apr 2023 05:56 PM (IST)
5 ఓవర్లకు కోల్‌కతా స్కోర్
షమీ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్(13) బౌండరీ కొట్టాడు. నితీశ్ రానా(3) క్రీజులో ఉన్నాడు. 5 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ స్కోర్.. 37/2
-
09 Apr 2023 05:51 PM (IST)
రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా
కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో వికెట్ పడింది. జోష్ లిటిల్ బౌలింగ్‌లో జగదీశన్(6) ఔటయ్యాడు. నాలుగు ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి కేకేఆర్ 28 రన్స్ చేసింది. వెంకటేశ్ అయ్యర్(7) క్రీజులో ఉన్నాడు.
-
09 Apr 2023 05:17 PM (IST)
విజయ్ శంకర్, సుదర్శన్ ఫిఫ్టీ.. రెండొందలు కొట్టిన గుజరాత్
సొంత గ్రౌండ్లో గుజరాత్ టైటన్స్ బ్యాటర్లు చెలరేగారు. విజయ్ శంకర్(63), సాయి సుదర్శన్(53) హాఫ్ సెంచరీ బాదడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ముందు 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్ధూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో విజయ్ శంకర్ రెచ్చిపోయాడు. సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అతను హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. 20 పరుగులు రావడంతో గుజరాత్ 204 రన్స్ చేయగలిగింది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ మూడు, సుయాశ్ శర్మ ఒక వికెట్ తీశారు.
Cracker of a knock this has been from @vijayshankar260! ⚡️ ⚡️
A 21-ball FIFTY for the @gujarat_titans' all-rounder - his first fifty in IPL! 👏 👏
Follow the match ▶️ https://t.co/G8bESXjTyh#TATAIPL | #GTvKKR pic.twitter.com/YPodXasrFv
— IndianPremierLeague (@IPL) April 9, 2023
-
09 Apr 2023 05:13 PM (IST)
విజయ్ శంకర్ ఫిఫ్టీ
విజయ్ శంకర్(51) హాఫ్ సెంచరీ బాదాడు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 20వ ఓవర్లో సిక్సర్‌తో అతను ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
-
09 Apr 2023 05:09 PM (IST)
దంచి కొడుతున్న విజయ్ శంకర్
విజయ్ శంకర్(45) ధాటిగా ఆడుతున్నాడు. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. గుజరాత్ 19 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 84 1పరుగులు స్కోర్ చేసింది.
-
09 Apr 2023 05:02 PM (IST)
సుదర్శన్ ఔట్.. నాలుగో వికెట్ డౌన్
హాఫ్ సెంచరీ కొట్టి జోరు మీదున్న సాయి సుదర్శన్(53) ఔటయ్యాడు. నరైన్ బౌలింగ్‌లో భారీషాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.
-
09 Apr 2023 04:58 PM (IST)
సుదర్శన్ హాఫ్ సెంచరీ
సాయి సుదర్శన్(51) వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఫెర్గూసన్ ఓవర్లో సింగిల్ తీసి అతను ఫిఫ్టీకి చేరువయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. గుజరాత్ 17 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు స్కోర్ చేసింది. విజయ్ శంకర్(16) క్రీజులో ఉన్నాడు.
Sai Sudharsan continues his fine form 👌
The left hander reaches his 5️⃣0️⃣ and has set up the base nicely for a strong finish 💪 #GT fans, how many runs can be scored in the last 3 overs?
Follow the match ▶️ https://t.co/G8bESXjTyh #TATAIPL | #GTvKKR | @gujarat_titans pic.twitter.com/ggLHqjbY9I
— IndianPremierLeague (@IPL) April 9, 2023
-
09 Apr 2023 04:53 PM (IST)
16 ఓవర్లకు స్కోర్
గుజరాత్ 16 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 144 స్కోర్ చేసింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో విజయ్ శంకర్(14) లాంగాన్‌లో ఫోర్ కొట్టాడు. సాయి సుదర్శన్(47) క్రీజులో ఉన్నాడు. వీళ్లు చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తుండడంతో పరుగులు వేగంగా వస్తున్నాయి.
-
09 Apr 2023 04:41 PM (IST)
2 వేల క్లబ్లో శుభ్‌మన్ గిల్
సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్లో మరో ఘనత సాధించాడు. 2వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 39 రన్స్‌కు ఔటైన అతను రెండు వేల క్లబ్లో చేరాడు.
🚨 Milestone 🚨
2️⃣0️⃣0️⃣0️⃣ runs already in the #TATAIPL for @ShubmanGill 👏🏻👏🏻
The fifty-partnership comes up between the #GT opener and Sai Sudharsan 👌👌
Follow the match ▶️ https://t.co/G8bESXjTyh#TATAIPL | #GTvKKR pic.twitter.com/US0u88QhMD
— IndianPremierLeague (@IPL) April 9, 2023
-
09 Apr 2023 04:39 PM (IST)
మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్
గుజరాత్ మరో వికెట్ కోల్పోయింది. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో అభినవ్ మనోహార్(14) బౌల్డ్ అయ్యాడు. దాంతో, 118 రన్స్ వద్ద గుజరాత్ మూడో వికెట్ పడింది. సాయి సుదర్శన్(35) క్రీజులో ఉన్నాడు.
WHAT. A. BALL! 👌 👌
Suyash Sharma sneaks one through the defence to dismiss Abhinav Manohar 👏 👏
Follow the match ▶️ https://t.co/G8bESXjTyh#TATAIPL | #GTvKKR | @KKRiders pic.twitter.com/xe3O16q8dz
— IndianPremierLeague (@IPL) April 9, 2023
-
09 Apr 2023 04:34 PM (IST)
అభినవ్ హ్యాట్రిక్ బౌండరీలు
ఉమేశ్ యాదవ్ ఓవర్లో అభినవ్ మనోహార్(14) రెచ్చిపోయాడు. వరుసగా మూడు బౌండరీలు కొట్టాడు. దాంతో, 14 రన్స్ వచ్చాయి. సాయి సుదర్శన్(32) క్రీజులో ఉన్నాడు. 13 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి గుజరాత్ 115 రన్స్ చేసింది..
-
09 Apr 2023 04:27 PM (IST)
శుభ్‌మన్ గిల్ ఔట్
శుభ్‌మన్ గిల్(39) ఔటయ్యాడు. సునీల్ నరైన్ ఓవర్లో గిల్ భారీ షాట్ ఆడాడు. అయితే.. బౌండరీ వద్ద ఉమేశ్ యాదవ్ చక్కని క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. దాంతో, 67 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
-
09 Apr 2023 04:24 PM (IST)
ఫెర్గూసన్ ఓవర్లో 3 రన్స్
ఫెర్గూసన్ వేసిన 11వ ఓవర్లో కేవలం మూడు రన్స్ వచ్చాయంతే. సాయి సుదర్శన్(24), శుభ్‌మన్ గిల్(37) క్రీజులో ఉన్నారు.
-
09 Apr 2023 04:20 PM (IST)
10 ఓవర్లకు స్కోర్
పది ఓవర్లకు గుజరాత్ 88 రన్స్ చేసింది. సాయి సుదర్శన్(22), శుభ్‌మన్ గిల్(36) క్రీజులో ఉన్నారు. వీళ్లు రెండో వికెట్‌కు 55 రన్స్ జోడించారు.
-
09 Apr 2023 04:03 PM (IST)
50 దాటిన గుజరాత్ స్కోర్.. ఒకే ఓవర్లో 16 పరుగులు
ఆరు ఓవర్లకు గుజరాత్ జట్టు 54 పరుగులు చేసింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో గుజరాత్ జట్టు 16 పరుగులు రాబట్టింది. శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు ఫోర్లు బాదడంతో పాటు ఐదు ఎక్స్ట్రా పరుగులు వచ్చాయి.
-
09 Apr 2023 04:00 PM (IST)
ఐదు ఓవర్లలో గుజరాత్ స్కోరు 38
గుజరాత్ టైటన్స్ నిలకడగా ఆడుతున్నది. ఐదు ఓవర్లలో 38 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 10, సాయి సుదర్శన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
09 Apr 2023 03:55 PM (IST)
తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లు గుజరాత్ తొలి వికెట్‌ను కోల్పోయింది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో జగదీషన్‌కు క్యాచ్ ఇచ్చి వృద్ధిమాన్ సాహా అవుట్ అయ్యాడు. సాహా 17 బంతుల్లో 17 రన్స్ చేశాడు. ఇందులో మూడు ఫోర్లు ఉన్నాయి.
Match 13. WICKET! 4.2: Wriddhiman Saha 17(17) ct Jagadeesan Narayan b Sunil Narine, Gujarat Titans 33/1 https://t.co/G8bESXjTyh #TATAIPL #GTvKKR #IPL2023
— IndianPremierLeague (@IPL) April 9, 2023
-
09 Apr 2023 03:48 PM (IST)
మూడో ఓవర్లలో గుజరాత్ స్కోరు 24
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటన్స్ మూడు ఓవర్లలో 24 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా 11, శుభ్‌మన్ గిల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
09 Apr 2023 03:24 PM (IST)
గుజరాత్, కోల్‌కతా తుది జట్లు ఇవే..
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్.
సబ్స్టిట్యూట్స్ : జాషువా లిటిల్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, శ్రీకర్ భరత్.
Match 13. Gujarat Titans XI: S Gill, W Saha (wk), S Sudharsan, V Shankar, D Miller, R Tewatia, A Manohar, Y Dayal, R Khan (c), M Shami, A Joseph. https://t.co/G8bESXjTyh #TATAIPL #GTvKKR #IPL2023
— IndianPremierLeague (@IPL) April 9, 2023
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు : రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఎన్ జగదీసన్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
సబ్స్టిట్యూట్స్ : మన్దీప్ సింగ్, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, డేవిడ్ వైస్.
Match 13. Kolkata Knight Riders XI: R Gurbaz (wk), S Narine, N Jagadeesan, N Rana (c), R Singh, A Russell, L Ferguson, S Thakur, U Yadav, S Sharma, V Chakaravarthy. https://t.co/G8bESXjTyh #TATAIPL #GTvKKR #IPL2023
— IndianPremierLeague (@IPL) April 9, 2023
-
09 Apr 2023 03:20 PM (IST)
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. దాంతో కెప్టెన్‌గా రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Take a look at the Playing XIs of both the sides 👌👌
1⃣ change for @gujarat_titans while @KKRiders make 2⃣ changes in their side.
Follow the match ▶️ https://t.co/G8bESXjTyh#TATAIPL | #GTvKKR pic.twitter.com/wzcANJxFyU
— IndianPremierLeague (@IPL) April 9, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

