ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జయింట్స్.. తమ జెర్సీని విడుదల చేసింది. ఈ ఏడాది ఐపీఎల్లో లక్నో, గుజరాత్ జట్లు కొత్తగా చేరిన సంగతి తెలిసిందే. వీటిలో గుజరాత్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహిస్తుండగా.. లక్నో జట్టుకు టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ సారధ్యం వహిస్తున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా తమ జట్టు జెర్సీ, థీమ్ సాంగ్‌ను లక్నో సూపర్ జయింట్స్ (ఎల్ఎస్జీ) విడుదల చేసింది. సోషల్ మీడియాలో జెర్సీని పంచుకుంటూ.. ‘‘అబ్ అప్నీ బారీ హై’’ అనే పాటను విడుదల చేసింది. ప్రముఖ సింగర్ బాద్షా ఈ సాంగ్ పాడాడు.
రెమో డిసౌజా దీన్ని డైరెక్ట్ చేయడంతోపాటు కొరియోగ్రఫీ కూడా చేశాడు. అభిమానులు ఈ జెర్సీని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి తొలి సీజన్లోనే ఎల్ఎస్జీ చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.
OFFICIAL: JERSEY OF @LucknowIPL
Designed by: Kunal Rawal#AbApniBaariHai | #IPL2022#LucknowSuperGiants #TATAIPL#WeAreSuperGiants #LSG2022 pic.twitter.com/4zO5DTmxjI
— SuperGiantsArmy™ — LSG FC (@LucknowIPLCover) March 22, 2022
The moment you’ve been waiting for! Poori taiyaari hai… Ab Apni Baari Hai!!! 🏏 🙌🏽#AbApniBaariHai
YouTube: https://t.co/OQYOThajgQ@rpsggroup @Its_Badshah @remodsouza @klrahul11 @GautamGambhir
#LucknowSuperGiants #TataIPL #LSG2022 #T20 #Cricket #UttarPradesh #Lucknow— Lucknow Super Giants (@LucknowIPL) March 22, 2022