Inzamam-ul-Haq | పాకిస్థాన్ చీఫ్ సెలెక్టర్‌గా ఇంజమామ్.. అతను ఈ పదవి చేపట్టడం ఎన్నోసారంటే..?
Inzamam-ul-Haq : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు పాకిస్థాన్ క్రికిట్ బోర్డు(Pakistan Cricket Board) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam-ul-Haq)ను మళ్లీ పురుషుల జట్టు చీఫ్ సెలెక్టర్(Mens Team Cheif Seletcor)గా ఎంపిక చేసింది. అనుభవజ్ఞుడైన అతడి సేవల్నిప్రపంచ కప్‌లో ఉపయోగించుకోవాలని...
Inzamam-ul-Haq : వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు పాకిస్థాన్ క్రికిట్ బోర్డు(Pakistan Cricket Board) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్(Inzamam-ul-Haq)ను మళ్లీ పురుషుల జట్టు చీఫ్ సెలెక్టర్(Mens Team Cheif Seletcor)గా ఎంపిక చేసింది. అనుభవజ్ఞుడైన అతడి సేవల్నిప్రపంచ కప్‌లో ఉపయోగించుకోవాలని బాధ్యతలు అప్పగించింది.
గతంలో మూడేళ్ల పాటు ఇంజమామ్ చీఫ్ సెలెక్టర్‌గా సేవలందించాడు. 2016 నుంచి 2019 ఈ పదవిలో కొనసాగాడు. మళ్లీ ఈసారి సరిగ్గా ప్రపంచ కప్ ముందు అతడు చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం. వరల్డ్ కప్‌లో ఆడేందుకు తమ జట్టును భారత్‌కు పంపేందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే.
Former Pakistan captain Inzamam ul Haq has been appointed national men’s chief selector. pic.twitter.com/TnPdQaoXvW
— Pakistan Cricket (@TheRealPCB) August 7, 2023
చీఫ్ సెలెక్టర్‌గా ఇంజమామ్ వెంటనే పనిలోకి దిగనున్నాడు. అఫ్గనిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు జట్టును ఎంపిక చేయనున్నాడు. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ వంటి ప్రధాన టోర్నీలకు ఇంజమామ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జట్టును సెలెక్ట్ చేయనుంది. టీమ్ డైరెక్టర్ మికీ ఆర్ధర్(Mickey Arthur), హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్(Grant Bradburn) కూడా ప్రస్తుత సెలెక్షన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
భారత్, పాకిస్థాన్ జట్లు

నిరుడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పాకిస్థాన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. దాంతో ఈసారి భారత్‌లో జరుగనున్న వన్డే వరల్డ్ కప్‌లో ట్రోఫీ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. భారత్, పాక్ జట్లు అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న తలపడనున్నాయి. అక్టోబర్ 5న మొదలు కానున్న ఈ మెగా టోర్నీ నవంబర్ 19న ముగియనుంది.
ఇవి కూడా చదవండి
Sherfane Rutherford | జాక్‌పాట్ కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్.. అమెరికాలో అర ఎకరం భూమి దక్కింది
ICC Player Of The Month | ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ బరిలో ఇద్దరు యాషెస్ హీరోలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

