రోమ్: ఇటాలియన్ ఓపెన్లో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) కూడా రఫెల్ నాదల్ బాటలోనే నడిచాడు. రోమ్ వేదికగా ఆదివారం ముగిసిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో జొకో.. 2-6, 3-6 తేడాతో 29వ సీడ్ చిలీ ఆటగాడు అలెజండ్రొ తబిలొ చేతిలో చిత్తుడా ఓడాడు. ఇదే టోర్నీలో రెండ్రోజుల క్రితమే నాదల్.. మూడో రౌండ్లోనే వెనుదిరిగిన విషయం విదితమే.