AUSW vs INDW | సిడ్నీలో అరుంధతి విశ్వరూపం.. తొలి టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం..!
AUSW vs INDW : వరల్డ్‌కప్ విజేతగా తొలి పర్యటనలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సిడ్నీ మైదానంలో పేసర్ అరుంధతి రెడ్డి (4-22) నిప్పులు చెరగడంతో.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది.
AUSW vs INDW : వరల్డ్‌కప్ విజేతగా తొలి పర్యటనలో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సిడ్నీ మైదానంలో పేసర్ అరుంధతి రెడ్డి (4-22) నిప్పులు చెరగడంతో ఆస్ట్రేలియాను 133కే కట్టడి చేసిన టీమిండియా.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించన ఛేదనలో ఓపెనర్ షఫాలీ వర్మ(21) రాణించింది. ఆరో ఓవర్ మొదటి బంతికే వాన అందుకోవడంతో భారత్‌ను విజేతగా ప్రకటించారు. అద్భుత విజయంతో మూడు టీ20 సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ పట్టేసి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు తొలి విదేశీ పర్యటనను ఘనంగా ఆరంభించింది. సొంతగడ్డపై రెచ్చిపోవాలనుకున్న ఆస్ట్రేలియాకూ ఊహించని షాకిస్తూ సిరీస్‌లో ముందంజ వేసింది. సిడ్నీ మైదానంలో టీమిండియా ధాటికి ఆసీస్ హడలిపోయింది. పేసర్ అరుంధతి రెడ్డి(4-22) కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో కంగారూ జట్టును కంగారెత్తించింది.
Innings Break!
Fantastic 4⃣-fer for Arundhati Reddy 🫡
2⃣ wickets each for Renuka Singh Thakur and Sree Charani 👏
Over to our batters to chase down 1️⃣3️⃣4️⃣! ⌛
Updates ▶️ https://t.co/juV5IzNYcG#TeamIndia | #AUSvIND️ pic.twitter.com/l20nvO5nx5
— BCCI Women (@BCCIWomen) February 15, 2026
పవర్ ప్లేలోనే..
వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా స్వదేశంలోనూ భంగపడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ బేత్ మూనీ(5)ని పవర్ ప్లే క్వీన్ రేణుకా సింగ్(2-14) ఔట్ చేసి ఒత్తిడిలో పడేసింది. దూకుడుగా ఆడుతున్న జార్జియా వోలి(18)ని నాలుగో ఓవర్లో క్రాంతి గౌడ్ వెనక్కి పంపగా.. అక్కడి నుంచి అరుంధతి రెడ్డి(4-22) విజృంభించింది. డేంజరస్ ఫొబే లిచ్‌ఫీల్డ్(26), ఎలీసా పెర్రీ(20), జార్జియా వరేహం(30)లను ఔట్ చేసిన ఈ ఆల్‌రౌండర్ ఆతిథ్య జట్టును కష్టాల్లో పడేసింది. మరో ఎండ్‌లో శ్రీ చరణి(2-14), రేణుకలు చెలరేగడంతో 18 ఓవర్లలో 133కే ఆస్ట్రేలియా ఆలౌటయ్యింది.
4⃣ Overs
2⃣2⃣ Runs
4⃣ Wickets 🔥Arundhati Reddy is the Player of the Match for her excellent spell of bowling 🙌
Scorecard ▶️ https://t.co/juV5IzNYcG#TeamIndia | #AUSvIND️ | @reddyarundhati pic.twitter.com/oNjQEJWlAM
— BCCI Women (@BCCIWomen) February 15, 2026
వర్షం ముప్పు పొంచి ఉన్నందున స్వల్ప ఛేదనను భారత ఓపెనర్ షఫాలీ వర్మ(21) దూకుడుగా ఆరంభించింది. నికోలా కారీని బాదేస్తూ 6, 4 కొట్టిన తను.. మొలినెక్స్ వేసిన ఐదో ఓవర్లో ఔటయ్యింది. అదే ఓవర్లో జోమీమా రోడ్రిగ్స్(9 నాటౌట్), స్మృతి మంధాన(16 నాటౌట్)లు చెరొక ఫోర్ రాబట్టగా.. డీఎల్ఎస్ ప్రకారం.. అవసరమైన దానికంటే 15 పరుగులు ఎక్కువే చేసింది. ఆరో ఓవర్ తొలి బంతికి జెమీమా బౌండరీ బాదిందో లేదో వాన మొదలైంది. డక్ వర్త్ లెక్కన.. అధిక్యంలో ఉన్న భారత్‌ను అంపైర్లు విజేతగా ప్రకటించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

