Sherfane Rutherford | జాక్‌పాట్ కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్.. అమెరికాలో అర ఎకరం భూమి దక్కింది
Sherfane Rutherford : క్రికెట్లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(Player Of The Series)గా నిలిచిన బ్యాటర్‌కు ఖరీదైన బైక్ లేదంటే కొత్త మోడల్ కారు బహుమతిగా ఇస్తారు. కానీ, వెస్టిండీస్ యువ క్రికెటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (Sherfane Rutherford)కు మాత్రం ఊహించని కానుక లభించింది. అతను అమెరికా(United States Of America)లో అర ఎకరం భూమిని...
Sherfane Rutherford : క్రికెట్లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'(Player Of The Series)గా నిలిచిన బ్యాటర్‌కు ఖరీదైన బైక్ లేదంటే కొత్త మోడల్ కారు బహుమతిగా ఇస్తారు. కానీ, వెస్టిండీస్ యువ క్రికెటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (Sherfane Rutherford)కు మాత్రం ఊహించని కానుక లభించింది. అతను అమెరికా(United States Of America)లో అర ఎకరం భూమిని బహుమతిగా అందుకున్నాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా..? కెనడాలో జరిగిన గ్లోబల్ టీ20(Global T20) మూడో సీజన్లో.
టోర్నీలో అద్భుతంగా రాణించిన రూథర్‌ఫర్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ట్రోఫీతో పాటు అర ఎకరం భూమి ఇచ్చారు. విండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్(Clive Lloyd) చేతుల మీదుగా అతను ఈ అవార్డు అందుకున్నాడు. దాంతో, అందరూ అతడిని జాక్‌పాట్ కొట్టేశాడని అంటున్నారు.
It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶
Dean Jones – Most Valuable Player ✅
Finals Man of the Match ✅
Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT— GT20 Canada (@GT20Canada) August 7, 2023
కెనడాలోని ఒంటారియోలో జూలై 20న మొదలైన గ్లోబల్ 20 లీగ్ ఆగస్టు 6న ముగిసింది. ఈసారి మాంట్రియల్ టైగర్స్(Montreal Tigers) జట్టు చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో సర్రీ జాగ్వార్స్(Surrey Jaguars) జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ టోర్నమెంట్ ఆసాంతం అదరగొట్టిన రూథర్‌ఫర్డ్ టైటిల్ పోరులోనూ సత్తా చాటాడు. 29 బంతుల్లో 38 రన్స్ కొట్టి జట్టు తొలి గ్లోబల్ టీ20 ట్రోఫీ అందించాడు. అతడికి ఆండ్రూ రస్సెల్(6 బంతుల్లో 20 పరుగులు) సహకరించాడు.
గ్లోబల్ 20 లీగ్ ట్రోఫీతో మాంట్రియల్ టైగర్స్ జట్టు

మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన రూథర్‌ఫర్డ్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. దాంతో, నిర్వహకులు అతడికి అమెరికాలో అర ఎకరం భూమి ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ధనాధన్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన రూథర్‌ఫర్డ్ ఐపీఎల్‌లోనూ మెరిశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్(Delhi Daredevils), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్ల తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.
ఇవి కూడా చదవండి
ICC Player Of The Month | ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు.. ఈ ముగ్గురు ఆల్‌రౌండర్ల మధ్యే పోటీ
ICC Player Of The Month | ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ బరిలో ఇద్దరు యాషెస్ హీరోలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

