Raebareli | రాయ్‌బరేలీ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. ఎన్నికల బరిలో యూపీ మంత్రి దినేష్ సింగ్
Raebareli | ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన రాయ్‌బరేలీ (Raebareli) లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో మంత్రి దినేష్ సింగ్‌ను మళ్లీ పోటీకి దించింది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన రాయ్‌బరేలీ (Raebareli) లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో మంత్రి దినేష్ సింగ్‌ను మళ్లీ పోటీకి దించింది. 2019లో ఇక్కడ నుంచి పోటీ చేసిన ఆయన సోనియా గాంధీ చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి గాంధీ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఓడిపోక తప్పదని దినేష్ సింగ్ తెలిపారు. నకిలీ గాంధీలను రాయ్‌బరేలి ప్రజలు సాగనంపుతారన్న నమ్మకం తనకు ఉందన్నారు.
కాగా, సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇప్పటి వరకు ఆమె ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ అరంగేట్రం చేయవచ్చన్న టాక్ వినిపిస్తున్నది. ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు సోనియా గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీని 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ సొంతం చేసుకున్నారు. అయితే రాయ్‌బరేలీతోపాటు అమేథీకి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. కాగా, ఈ రెండు స్థానాల నుంచి తమ కుటుంబ సభ్యులు పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ ఇష్టపడటం లేదని సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

