లండన్: ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ విషయాన్ని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) చీఫ్, వెటరన్ కామెంటేటర్ మార్క్ నికోలస్ వెల్లడించాడు. ది హండ్రెడ్‌లో ఫ్రాంచైజీగా ఉన్న ‘లండన్ స్పిరిట్’లో వాటాలు దక్కించుకునేందుకు ఐపీఎల్ జట్లు ఆసక్తిగా ఉన్నాయని ఆయన తెలిపాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో నికోలస్.. లండన్ స్పిరిట్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే హండ్రెడ్‌లో పెట్టుబడులు పెట్టబోయే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఏవన్నది మాత్రం అతడు వెల్లడించలేదు.