బెంగళూరు: మహిళల ప్రపంచకప్ టోర్నీకి ముందు భారత జట్టు పేసర్ అరుంధతి రెడ్డికి గాయం బారీన పడింది. మెగా టోర్నీకి సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టుతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఆమె గాయపడింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో హీథర్ నైట్ కొట్టిన బంతి నేరుగా అరుంధతి ఎడమ మోకాలికి తాకింది.
నొప్పితో విలవిల్లాడిన ఆమెను వైద్య సేవల నిమిత్తం దవాఖానాకు తరలించారు. మరో నాలుగు రోజుల్లో వన్డే ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో అప్పటివరకు అరుంధతి కోలుకుంటుందా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఒకవేళ ఆమె గాయం పెద్దదై టోర్నీకి దూరమైతే భారత జట్టుకు పేస్ విభాగంలో తిప్పలు తప్పవు.